Begin typing your search above and press return to search.
'జగనన్నే మా భవిష్యత్తు..' ఓ రైతు షాకింగ్ డెసిషన్..!
By: Tupaki Desk | 20 April 2023 8:00 PM GMTఏపీ సీఎం జగన్ మానసపుత్రికగా పేర్కొనే కార్యక్రమాల్లో ఇటీవల ప్రారంభించిన జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ఒకటి. పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, వలంటీర్లు, గృహ సారథులు వారి వారి నియోజకవర్గాలు, వార్డుల్లో ప్రజలను కలుస్తూ.. వారికి అందుతున్న సంక్షేమ ఫలాలను వివరించే కార్యక్రమం. అంతేకాదు ఈ సందర్భంగా ఒక స్టిక్కర్‌ను ఇంటి తలుపులకు అంటిస్తారు. అదేవిధంగా మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తమ మద్దతు పార్టీకే ఉందని చెప్పడం ఈ కార్యక్రమంలో ప్రధాన భాగం.
అయితే ఈ కార్యక్రమాన్ని ముందు ప్రారంభించినప్పుడు కొందరు ఎమ్మెల్యేలు పెదవి విరిచారు. ఇది ఒకసర్వే ప్రజలు ఏమేరకు సహకరిస్తారో అని భావించారు. కానీ, అనూహ్యంగా ఈ కార్యక్రమానికి మద్దతు పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి స్పందన బాగానే లభిస్తోంది. ఏప్రిల్ 7వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం మొదలైంది. అప్పటి నుంచి ప్రజలు భాగస్వామ్యం అవుతున్న తీరు సర్వత్రా ఆకట్టుకుంటోంది.
ఇప్పటివరకు 84 లక్షల కుటుంబాల సర్వే పూర్తి అయ్యింది. ఆయా కుటుంబాల వద్దకు పార్టీ నాయకులు వెళ్లి పథకాలు వివ రించారు. జగన్ పాలన పైనా ఆరా తీశారు. అదేసమయంలో వచ్చే ఎన్నికల్లోనూ పార్టీకి అండగా నిలవాలని వ్యాఖ్యానించారు. దీనికి ప్రజల నుంచి అనూహ్య మైన మద్దతు లభించింది ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా 63 లక్షలకు పైగా మిస్డ్ కాల్స్ వచ్చాయి.
గత 46 నెలలుగా సీఎం వైఎస్ జగన్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అందిస్తున్న పరిపాలనను జగన్ మెచ్చుకున్నారు. ఇక, పార్టీ నేతలు, వలంటీర్లు గత టీడీపీ సర్కార్‌కూ. జగన్ ప్రభుత్వానికి మధ్యనున్న తేడాలను వివరిస్తూ కరపత్రాలు అందిస్తు న్నారు. ప్రజల అభిమానానికి కొన్ని మచ్చుతునకలు పరిశీలిస్తే. నంద్యాల జిల్లా పాణ్యం మండల పరిధిలోని కందికాయపల్లె గ్రామానికి చెందిన బిరవోలు శివ అనే రైతు తన ఎడ్లకు సీఎం వైఎస్ జగన్ స్టిక్కర్ అతికించి పొలాన్ని దున్నడం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇటీవల గ్రామంలో 'జగనన్నే మా భవిష్యత్' కార్యక్రమంలో భాగంగా గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు పర్యటించారు. రైతు ఇంటి బయట స్టిక్కర్ అతికించేందుకు శివ అనుమతి కోరగా. అభిమాన నాయకుని ఫొటో బయటకాదని, ఇంట్లో ఉండాలనడం విశేషం.