బళ్లు.. ఓడలవడం.... పులమ్మిన చోటనే.. కట్టెలమ్మడం... ఇవన్నీ పాత సామెతల్లా నేటి తరం కొట్టి పారేస్తుంది కాని... కొన్ని సంఘటనలు చూస్తే మాత్రం ఇవి ఎప్పటికీ నిత్య సత్యాలని అంగీకరించక మానదు. కావాలంటే తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటకు వెళ్తే వీటికి రుజువులు కనిపిస్తాయి. ఇంతకీ ఏం జరిగిందనుకుంటున్నారా.... ఏం లేదు... చాలా కాలం పాటు తెలుగుదేశం పార్టీలో ఉండి... తన కులాభిమానంతో మెగాస్టార్ పెట్టిన ప్రజారాజ్యంలో చేరి అక్కడ ఇమడ లేక వైఎస్ ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకుడు జ్యోతులు నెహ్రుని చూస్తే తెలుస్తుంది. స్ధానికంగా ఆయనకు ఎంత పట్టు ఉందో... అంతే స్ధాయిలో ఆయన ప్రవర్తన పట్ల కూడా నియోజకవర్గ ప్రజల్లో వ్యతిరేకతా ఉంది.
దీనిని గమనించే తెలుగుదేశం పార్టీలో ఉండగా చంద్రబాబు నాయుడు.... జ్యోతుల నెహ్రును ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు.జిల్లాలో ఆయన బంధువులకు.... వియ్యంకుడైన వారికి మంత్రి పదవులు - ఇతర కార్పొరేషన్ పదవులు ఇచ్చారు తప్ప జ్యోతులకు మాత్రం ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో అలిగిన ఆయన అదును కోసం ఎదురు చూసారు. మా పార్టీ వచ్చింది అనుకుని... అక్కడ తన ప్రభ వెలిగిపోతుంది అనుకుని మెగాస్టార్ చిరంజీవి పార్టీలో చేరారు. అక్కడ రాజ్యమేలిన డబ్బు రాజకీయాలకు జ్యోతులకు దిమ్మ తిరిగి.... జగ్గంపేట సెంటర్ కనిపించింది. అంతే ఆ పార్టీని వదిలి మళ్లీ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజకీయ పార్టీ అన్నాక కొన్ని నిర్ణయాలు భవిష్యత్ లో తప్పు అని తెలుస్తాయి. అలా జగన్‌కు కూడా జ్యోతుల విషయంలో కూడా ఆలస్యంగా విషయం తెలిసింది. స్వార్ధానికి మారుపేరుగా జిల్లాలో పేరు తెచ్చుకున్న జ్యోతుల నెహ్రు అవసరం చూసుకుని తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. అన్నా... అన్నాఅని గౌరవించి.... పిఎసీ చైర్మన్ పదవిని కూడా ఇవ్వాలనుకున్నారు. అయితే తన సహజ వెన్నుపోటు ధోరణిని వదులుకోలేని జ్యోతుల నెహ్రు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు.
తాజాగా... వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లాలో చేసిన పర్యటనలో కాపులకు కంచుకోట అయిన జగ్గంపేటలోనే రిజర్వేషన్లపై చేసిన ప్రకటన జ్యోతులకు నెహ్రుకు మళ్లీ మరోసారి దిమ్మ తిరిగి... జగ్గంపేట సెంటర్ కనిపించింది. జగన్ మోహన్ రెడ్డి ప్రకటనతో పాటు... అక్కడే ఆయన మాట్లాడుతూ " మీ నియోజకవర్గంలో వెన్నుపోటు పోడిచే నాయకులున్నారు " అని ప్రకటించగానే సభికుల నుంచి వచ్చిన స్పందన చూసిన జ్యోతుల నెహ్రుకు అసలు విషయం బోధపడిందట. జగన్ పట్ల ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో... రిజర్వేషన్లపై ఆయనకు ఎంత స్పష్టత ఉందో సభాముఖంగా తెలుసుకున్న జ్యోతుల ఇప్పుడు " నేను తప్పు చేశాను " అని సన్నిహితుల వద్ద వాపోయారని చెబుతున్నారు. అప్పటికప్పుడు.... స్వప్రయోజనాల కోసం.... డబ్బు కోసం నిర్ణయాలు తీసుకుంటే ఎలా ఉంటుంది అనడానికి జ్యోతుల ఉదంతమే పెద్ద ఉదాహరణ. చంద్రబాబు నాయుడు వంటి మోసకారి రాజకీయ నాయకుడి కంటే అధికారం రాకపోయినా మాట మీద నిలబడడం - ఏది జరుగుతుందో... ఏది జరగదో ప్రజలకు వివరించి వారిని మోసం చేయకపోవడం అనే లక్షణాలే ఉన్న జగనే మేలని జ్యోతుల పశ్చాత్తాపం చెందుతున్నారట.