Begin typing your search above and press return to search.
జగ్గారెడ్డి...కేసీఆర్ భగ్నప్రేమికుడు
By: Tupaki Desk | 16 Feb 2019 5:14 AM GMTకాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నేత - సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావుపై ప్రేమను చాటుకుంటున్నారు. గతంలో టీఆర్ ఎస్ లో ఓ వెలుగు వెలిగి అనంతరం కాంగ్రెస్ లో చేరి కేసీఆర్ పై నిప్పులు చల్లిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలి కాలంలో ఆయన టోన్ మారింది.
సీఎం కేసీఆర్ వల్ల తనకు - తన కుటుంబానికి మంచే జరిగిందని - ఎమ్మెల్యేగా చట్ట సభలోకి ప్రవేశించానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ టీఆర్ ఎస్ పెట్టడంతోనే ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం లభించిందని అన్నారు. ప్రజలు జగ్గారెడ్డి అంటే గుర్తు పట్టేస్థాయికి ఎదిగానని సెలవిచ్చారు. ఇలా కేసీఆర్ పై ప్రశంసలు కురిపిస్తున్న జగ్గారెడ్డి తాజాగా కీలక ప్రకటన చేశారు. తాను కేసీఆర్ ను కలవనున్నట్లు ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష కార్యాలయంలో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశం కానున్నట్లు ప్రకటించారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు తాగునీరు కరువైందని - సింగూరును నీళ్లతో నింపి ప్రజలను ఆదుకోవాలని కోరుతానని చెప్పారు. నిబంధనల ప్రకారం సింగూరు జలాశయం నుంచి సంగారెడ్డికి 1 టీఎంసీ నీరు ఇవ్వాల్సి ఉన్నదని చెప్పారు. సింగూరు నీళ్ల కోసం ఈ నెల 18 నుంచి సంగారెడ్డిలో రిలే నిరాహారదీక్ష చేస్తానని తెలిపారు. సింగూరు నీళ్లకోసం కేసీఆర్ ను కలిసి విజ్ఞప్తి చేస్తానని అన్నారు. హరీశ్ రావు మంత్రిగా ఉన్న సమయంలో తన స్వార్థం కోసం సింగూరుకు అన్యాయం చేశారని ఆరోపించారు. కేసీఆర్ పై - ఆయన కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేయలేదని, ఆయన ఎంతో ఇష్టమైన నేత అని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ - ఎమ్మెల్యే కేటీఆర్ ను కలుస్తానని ఆయన పునరుద్ఘాటించారు.
ఓ వైపు సొంత పార్టీ అయిన కాంగ్రెస్ లో లాబీయిస్టుల హవా నడుస్తున్నదని ఆ పార్టీ ఎమ్మెల్యేనే అయిన జగ్గారెడ్డి వ్యాఖ్యానించడం..దానికి తోడుగా - పదవులన్నీ లాబీయింగ్ తోనే వచ్చాయని చెప్పారు. అధిష్ఠానం లాబీయింగ్ ను ప్రోత్సహించవద్దని - పార్టీని బలోపేతం చేసేవారికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ కలకలం సృష్టించడం....అదే సమయంలో టీఆర్ ఎస్ అధినేత - ఆయన వారసుడిని పొగడటం వెనుక లెక్కేంటని పలువురు చర్చించుకుంటున్నారు.