Begin typing your search above and press return to search.

కేసీఆర్ - జగన్ ఆ కూటమి వైపే వస్తారన్న కాంగ్రెస్ నేత!

By:  Tupaki Desk   |   7 May 2019 4:53 PM GMT
కేసీఆర్ - జగన్ ఆ కూటమి వైపే వస్తారన్న కాంగ్రెస్ నేత!
X
కాంగ్రెస్ లోనే ఉన్నా.. తెలంగాణ రాష్ట్ర సమితి వైపు చూస్తున్నారు.. అనిపించుకుంటున్న సీనియర్ పొలిటీషియన్ జగ్గారెడ్డి ఆసక్తిదాయకమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిల విషయంలో జగ్గారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం మళ్లీ ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసిన జగ్గారెడ్డి - ఆ కూటమిలోకి కేసీఆర్ - జగన్ లు చేరినా పెద్దగా ఆశ్చర్యం అక్కర్లేదని వ్యాఖ్యానించారు.

ఇలా కేసీఆర్ - జగన్ తమవాళ్లే అన్నట్టుగా ఈయన చెప్పుకొచ్చారు. మరి ఈయన తెలంగాణ రాష్ట్ర సమితికి - కాంగ్రెస్ కు దూరం తగ్గించాలని మాట్లాడుతూ ఉన్నారో లేక రాజకీయ జోస్యమే చెప్పారో కానీ.. ఈ వ్యాఖ్యలు అయితే ఆసక్తిదాయకంగా ఉన్నాయి.

ఇటీవలే ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి కేసీఆర్ కు ఒక లేఖ రాశారు. కేంద్రంలో కాంగ్రెస్ కూటమికి మద్దతును ఇవ్వాలని ఆ లేఖలో రఘువీర కోరారు. దానిపై తెలంగాణ రాష్ట్ర సమితి ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు. ఇలాంటి క్రమంలో జగ్గారెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తిదాయకంగా ఉంది.

ఒకవైపు కేసీఆర్ ఏమో ఫెడరల్ ఫ్రంట్ అంటూ రాష్ట్రాలు పట్టుకుని తిరుగుతూ ఉన్నారు. జగన్ ను కేసీఆర్ తన కూటమిలోకి కలిపేసుకున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారట. ఇలాంటి సమయంలో..కేసీఆర్ - జగన్ ఇద్దరూ యూపీఏలోకి వస్తారంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించడం ఆసక్తిదాయకంగా ఉంది. మరి దీనిపై తెలంగాణ రాష్ట్ర సమితి ఏమంటుందో - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందో!