Begin typing your search above and press return to search.
కేసీఆర్ షాకిచ్చిన టైగర్ జగ్గారెడ్డి
By: Tupaki Desk | 8 Aug 2015 9:14 AM GMTతెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ తెరాస బలోపేతం కోసం ఎన్ని స్కెచ్ లైనా వేస్తున్నారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిచ్చేసి తన వైపునకు తిప్పుకుంటారు. ఎమ్మెల్యే గా ఓడిపోయిన ఇతర పార్టీల వారినైనా తన పార్టీలోకి తీసుకుని మంత్రి పదవులిచ్చేస్తున్నారు. ఆయన చిన్న ఎంపీటీసీ స్థానం నుంచి ఎమ్మెల్సీ వరకు ఇతర పార్టీలకు వెళ్లనిచ్చేందుకు అస్సలు ఇష్టపడడం లేదు. అందుకోసం పైన చెప్పినట్టు ఏదైనా చేసేస్తున్నారు.
అయితే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ గెలిచి తెరాసకు కాస్త ధీటుగా ఉన్నా అనిపించుకుంది.ఇవన్నీ ఒక ఎత్తయితే తెరాస ఎంతో బలంగా ఉన్న..అదీ సీఎం సొంత జిల్లా అయిన మెదక్ లో ఓ ఎంపీపీ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మామూలుగా అందులో పెద్ద విశేషం ఏం లేకపోయినా..సీఎం కేసీఆర్ ఇన్ని ఎత్తులు వేస్తున్న టైంలో అది కూడా..తెరాస సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం పెద్ద మైనస్.
సదాశివపేట మండల అద్యక్ష పదవిని కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో ఆ పార్టీలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇక్కడ తెరాసకు మెజార్టీ లేకపోయినా పదవి దక్కించుకుంది. ఎంపీపీ అకాల మృతితో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసింది. ఇక్కడ విశేషం ఏంటంటే టీఆర్ ఎస్ బలపరచిన స్వతంత్ర్య అభ్యర్థి కాంగ్రెస్ కు ఓటు వేయడంతో కాంగ్రెస్ బలపరచిన లక్ష్మమ్మ ఎంపీపీ అయ్యారు.ఇటీవలే బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన టైగర్ జగ్గారెడ్డి ఈ ఎన్నికలను జాగ్రత్తగా పర్యవేక్షించి తెరాసకు షాక్ ఇచ్చారు. ఏదేమైనా జగ్గారెడ్డి కాంగ్రెస్ లో రీ ఎంట్రీ తోనే కేసీఆర్ కు షాక్ ఇచ్చారన్న చర్చలు జరుగుతున్నాయి.