Begin typing your search above and press return to search.

జ‌గ్గారెడ్డికి కేసీఆర్ మేలు చేశారా?

By:  Tupaki Desk   |   28 Sep 2018 4:38 AM GMT
జ‌గ్గారెడ్డికి కేసీఆర్ మేలు చేశారా?
X
అవును.. తెలంగాణ ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు థ్యాంక్స్ చెబుతున్నారు తెలంగాణ‌ కాంగ్రెస్ నేత జ‌గ్గారెడ్డి. అదేంటి.. అక్ర‌మంగా కేసులు బ‌నాయించిన కేసీఆర్ పేరు వినిపిస్తే చాలు.. అంతెత్తు ఎగిరిప‌డే జ‌గ్గారెడ్డి ఇలా వ్య‌వ‌హ‌రించ‌టం ఏమిటి? అన్న‌సందేహం అక్క‌ర్లేదు. దానికి కార‌ణం లేక‌పోలేదు. త‌న‌పై జ‌మానా నాటి కేసుల్ని తిర‌గ‌దోడుతున్న అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన జ‌గ్గారెడ్డి.. దీనంత‌టికి కార‌ణం కేసీఆర్ గా గ‌తంలో ఆరోపించారు. అయితే.. తాజాగా మాత్రం ఆయ‌న త‌న ఆగ్ర‌హాన్ని మ‌రోలా వ్య‌క్తం చేస్తున్నారు.

కేసులు తిర‌గ‌దోడ‌టం ద్వారా కేసీఆర్ త‌న‌కు చాలానే మేలు చేశార‌ని సంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు జ‌గ్గారెడ్డి. విచార‌ణ‌లో భాగంగా త‌న ఇంటికి వ‌చ్చిన విచార‌ణ అధికారులు త‌న ఇంటిని చూసి ఆశ్చ‌ర్య‌పోయార‌న్నారు. త‌న విష‌యంలో కేసీఆర్ క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌న్న విష‌యం ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైంద‌న్నారు.

అందుకే.. తాను కేసీఆర్ కు థ్యాంక్స్ చెబుతున్న‌ట్లుగా వెల్ల‌డించారు. అక్ర‌మంగా అరెస్ట్ చేయించారంటూ నిన్న‌టివ‌ర‌కూ నిప్పులు చెరిగిన జ‌గ్గారెడ్డి.. ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యంగ్యంతో చేస్తున్న వ్యాఖ్య‌లు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. అయితే.. ఇలాంటి మాట‌లు ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యే విష‌యంలో కాస్త తేడా వ‌స్తే మొద‌టికే మోసం వ‌స్తుంద‌న్న విష‌యాన్ని జ‌గ్గారెడ్డి గుర్తిస్తే మంచిది.