Begin typing your search above and press return to search.

దీక్ష‌కు సిద్ధ‌మ‌వుతున్న ఫైర్ బ్రాండ్

By:  Tupaki Desk   |   1 Nov 2016 5:53 AM GMT
దీక్ష‌కు సిద్ధ‌మ‌వుతున్న ఫైర్ బ్రాండ్
X
కాంగ్రెస్ నాయ‌కుడు - ప్రభుత్వ మాజీ విప్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) మ‌రోమారు తెలంగాణ‌ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావుపై విరుచుకుప‌డ్డారు. కేసీఆర్‌ అంటే అంతెత్తున లేచే జ‌గ్గారెడ్డి తాజాగా ఆయ‌న ప‌రిపాల‌న తీరును త‌ప్పుప‌డుతూ కేసీఆర్ వైఖ‌రి శిశుపాలుని మాదిరిగా ఉందని విమ‌ర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వంద అబద్దాలు ఆడారని పేర్కొంటూ ఆయన గ‌డువు ముగిసింద‌ని ఆరోపించారు.

తెలంగాణ‌లో అనేక స‌మ‌స్య‌లు ఉన్న‌ప్ప‌టికీ ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ వాటిని ప‌రిష్క‌రించ‌కుండా త‌న‌కు న‌చ్చిన విధంగా ముందుకు వెళుతున్నార‌ని జ‌గ్గారెడ్డి మండిప‌డ్డారు. ముఖ్యంగా ఫీజు రీయంబర్స్‌ మెంట్ అమ‌లు చేయకపోవడంతో సుమారు 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 3200 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకపోవడంతో రెండున్నర లక్షల మంది అధ్యాపకులకు వేతనాలు రావడం లేదని జ‌గ్గారెడ్డి అన్నారు. విద్యార్థులతో పెట్టుకోవడం మంచిది కాదని ఆయన హితవు చెప్పారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తాను నవంబర్ 7న సంగారెడ్డిలో సుమారు 5 వేల మంది విద్యార్థులతో మహా ధర్నా నిర్వహించనున్నానని జ‌గ్గారెడ్డి తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/