Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ తో జగ్గారెడ్డి సినిమా ఇదేనట..!

By:  Tupaki Desk   |   22 Oct 2019 8:14 AM GMT
పవన్ కళ్యాణ్ తో జగ్గారెడ్డి సినిమా ఇదేనట..!
X
పవన్ పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారు. ఎంతమంది చెప్పినా.. ఫ్యాన్స్ అడుగుతున్నా సినిమాలు చేయడానికి మాత్రం ముందుకు రావడం లేదు. చావైనా బతుకైనా పాలిటిక్స్ లోనే అంటూ మంకు పట్టు పట్టి కూర్చున్నాడు.

అయితే ఇంత మంది పిలిచినా రానీ పవన్ కళ్యాణ్ తను పిలిస్తే వస్తాడని.. తన బయోపిక్ లోనే నటిస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నాడు కాంగ్రెస్ వివాదాస్పద ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఈ సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తాజాగా హాట్ కామెంట్స్ చేశారు.

ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ తన బయోపిక్ లో నటించే అవకాశం ఉందని.. కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి ఓ మీడియాతో మాట్లాడుతూ హాట్ కామెంట్ చేశారు.

తనకు రాజకీయాలు అంటే చాలా ఇష్టమని.. వ్యక్తిగత జీవితంలో తగిలిన ఎదురుదెబ్బల నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన వైనం మంచి బయోపిక్ అవుతుందని జగ్గారెడ్డి వివరించారు. అందుకే తన బయోపిక్ ప్లాన్ చేస్తున్నానని.. ఇందులో పవన్ కళ్యాణ్ ను నటించేలా ఒప్పించే ప్రయత్నం చేస్తానని అన్నారు.

అసలే దేశభక్తుడు.. పైగా అవినీతి - అక్రమాలకు దూరంగా ఉండే పవన్ కళ్యాణ్ ఏకంగా కొన్ని కేసులతో ఓ సారి జైలుకు కూడా వెళ్లి వచ్చిన జగ్గారెడ్డి బయోపిక్ లో నటిస్తాడా? అసలు పవన్ తో జగ్గారెడ్డికి ఉన్న సాన్నిహిత్యం ఏపాటిది? జగ్గారెడ్డి అడిగితే పవన్ ఒప్పుకుంటాడా అన్నది వేచిచూడాలి.