Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ లో కలవరం...జగ్గారెడ్డి దారెటు?
By: Tupaki Desk | 5 Feb 2019 6:35 AM GMTకాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని ఓ హోటల్ లో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. కాంగ్రెస్‌లో లాబీయిస్టుల హవా నడుస్తున్నదని ఆరోపించారు. సీఎం కేసీఆర్ వల్ల తనకు - తన కుటుంబానికి మంచే జరిగిందని - ఎమ్మెల్యేగా చట్టసభలోకి ప్రవేశించానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ టీఆర్ ఎస్ పెట్టడంతోనే ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం లభించిందని అన్నారు. ప్రజలు జగ్గారెడ్డి అంటే గుర్తు పట్టేస్థాయికి ఎదిగానని తెలిపారు. ఇప్పుడు పదవులన్నీ లాబీయింగ్ తోనే వచ్చాయని చెప్పారు. అధిష్ఠానం లాబీయింగ్ ను ప్రోత్సహించవద్దని - పార్టీని బలోపేతం చేసేవారికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ సభ్యుడిగా పదవి ఇచ్చిన్పటికీ తనను చూసి ఓట్లు వేసే పరిస్థితి లేదని జగ్గారెడ్డి నిర్మొహమాటంగా చెప్పారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలెవరూ పెద్దగా సహకరించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికల ముందు ఓ కేసులో జైలుకు వెళ్తే - తన కుమార్తె ఎన్నికల ప్రచారం నిర్వహించి రాజకీయ వారసురాలిగా ప్రజల్లో స్థానం సంపాదించారని చెప్పారు. రెండు రకాలుగా సీఎం కేసీఆర్ వల్లే తన కుటుంబానికి డబుల్ బొనాంజా కలిసివచ్చిందని తెలిపారు. కేసీఆర్‌పై, ఆయన కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేయలేదని, ఆయన ఎంతో ఇష్టమైన నేత అని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ - ఎమ్మెల్యే కేటీఆర్ ను కలుస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మరింత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను విభేదించేదంతా హరీశ్ రావుతోనేనని - తనను జైల్లో పెట్టించింది ఆయనేనని ఆరోపించారు. ఉనికి కోసం హరీశ్ తనను బలి చేసే యత్నం చేశారని దుయ్యబట్టారు. హరీశ్ తో పోలిస్తే కేటీఆర్ చాలా ఫెయిర్ అని వ్యాఖ్యానించారు. హరీశ్ ఇప్పుడు టీఆర్ ఎస్ ను వీడతారని తాను అనుకోవడం లేదన్నారు. తాను కాంగ్రెస్ పార్టీ మారేది లేదని - అయితే నియోజకవర్గ అభివృద్ధి - సంగారెడ్డిలో మెడికల్ కళాశాల కోసం కేసీఆర్ - కేటీఆర్ లను కచ్చితంగా కలుస్తానని చెప్పారు. తాను టీఆర్ ఎస్ ను వీడినప్పటి నుంచి కేసీఆర్ తో లోపాయికారీగా కలిసింది ఎప్పుడూ లేదని - కేసీఆర్ - కేటీఆర్ లతో తాను మాట్లాడలేదని చెప్పారు. ఆపద వస్తే ఆదుకుంటారనే విశ్వాసం కాంగ్రెస్ లో లేదన్నారు. కాంగ్రెస్ లో ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యేలు - పోటీ చేసిన అభ్యర్థుల్లో చాలా మంది ఆర్థికంగా దెబ్బతిన్నారని - వారికి అధిష్టానం భరోసా ఇవ్వకపోతే కోలుకోవడం కష్టమేనని జగ్గారెడ్డి వాపోయారు.
ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో మథనపడిపోతున్న కాంగ్రెస్ నేతలు తాజాగా పైర్ బ్రాండ్ నేతగా పేరున్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ లో కమిటీలు - పదవుల విషయంలో రాహుల్ తీసుకునే నిర్ణయాలన్నింటికీ కట్టుబడి ఉంటానన్న జగ్గారెడ్డి... ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తే తప్ప కాంగ్రెస్ లో పదవులు దక్కే పరిస్థితి లేదని వ్యాఖ్యానించడం వెనుక ఆయన వైఖరిలో మార్పు రావడమే కారణమని పలువురు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీ నిర్ణయాలు ఈనాడే కొత్తగా వచ్చిన పోకడ కాదని...జగ్గారెడ్డి సైతం పార్టీలోకి నిన్నో మొన్నో వచ్చిన నాయకుడు కాదని...ఇలాంటి విషయాలు తెలిసినప్పటికీ...ఆయన వ్యాఖ్యల వెను మర్మం వేరే ఉందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.