Begin typing your search above and press return to search.

హరీష్ - జగ్గారెడ్డి.. సన్మానం తర్వాత కథ?

By:  Tupaki Desk   |   28 Sep 2019 10:25 AM GMT
హరీష్ - జగ్గారెడ్డి.. సన్మానం తర్వాత కథ?
X
తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటైన కొత్తలో ఒకే పార్టీలో హరీష్ రావు - జగ్గారెడ్డిలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఒకే జిల్లాకు చెందిన వారుగా కలిసికట్టుగా ఉండేవారు. కానీ వైఎస్ ఉమ్మడి ఏపీలో అధికారంలోకి వచ్చాక ఆపరేషన్ ఆకర్ష్ కు జగ్గారెడ్డి గులాబీ గూటిని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత బీజేపీలోకి మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చేశారు.ఈ పదిహేనేళ్ల కాలంలో హరీష్ రావుకు - జగ్గారెడ్డికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు పొడచూపాయి..

అయితే హరీష్ రావును శతృవుగా చూసే సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇప్పుడు మారిపోయారు. మొన్న అసెంబ్లీలో హరీష్ రావును కలిసి అరగంట రహస్య చర్చలు జరిపారు. ఆ తర్వాత నిన్న సంగారెడ్డిలో శాలువ కప్పి హరీష్ ను సన్మానించారు.

దీంతో జగ్గారెడ్డి తిరిగి సొంతగూటికి టీఆర్ ఎస్ లోకి వస్తారని అంతా భావించారు. తాజాగా టీఆర్ఎస్ లో చేరుతున్నారన్న వార్తలపై జగ్గారెడ్డి స్పందించారు. అబ్బే తూచ్ తాను టీఆర్ ఎస్ లో చేరడం లేదన్నారు. మా మెదక్ జిల్లా మంత్రిగా హరీష్ తో నియోజకవర్గ అభివృద్ధి - పనుల గురించి చర్చించానని మాత్రమే చెప్పుకొచ్చారు.

అయితే జగ్గారెడ్డి ఈ ట్విస్ట్ వెనుక అసలు కారణం వేరే ఉందని టీఆర్ ఎస్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాను కాంగ్రెస్ ను వీడి టీఆర్ ఎస్ లో చేరాలనుకుంటున్నానని.. కేసీఆర్ తో చర్చించి ఒప్పించాలని జగ్గారెడ్డి.. తాజాగా మంత్రి హరీష్ రావు ద్వారా మంతనాలు సాగించినట్టు సమాచారం.. ఈ ప్రతిపాదనను టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ముందు హరీష్ రావు ఉంచగా.. జగ్గారెడ్డి చేరికకు కేసీఆర్ నో చెప్పారట.. తనను తీవ్రంగా దూషించి అవమానించిన జగ్గారెడ్డిని టీఆర్ ఎస్ లో ఎట్టిపరిస్థితుల్లో చేర్చుకోవడానికి కేసీఆర్ సూతారం ఒప్పుకోలేదని సమాచారం. అందుకే ఇప్పుడు తాజాగా తాను టీఆర్ ఎస్ లో చేరడం లేదని జగ్గారెడ్డి మీడియా ఎదుట నొక్కి వక్కాణించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.