Begin typing your search above and press return to search.
ఎదురుదాడి బృందాలు రెడీఅవుతున్నాయా ?
By: Tupaki Desk | 16 Jun 2023 9:59 AM GMTతొందరలో జరగబోతున్న ఎన్నికల ను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్షాల పైకి ఎదురుదాడి చేయటానికి జగన్మోహన్ రెడ్డి రెండుబృందాల ను రెడీ చేస్తున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఈ ఎదురుదాడి బృందాలు రెండు రకాలుగా ఉండబోతోందట.
మొదటిదేమో రాష్ట్రస్ధాయి బృందం. రెండోదేమో జిల్లాల స్ధాయి బృందాలు. పార్టీ లో మంచి వాగ్దాటి కలిగిన నేతల ను రెండు బృందాల్లో నియమించాలని జగన్ అనుకుంటున్నట్లు సమాచారం. మొదటి బృందమేమో చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు సమాధానమిస్తాయట.
రెండో బృందమేమో ప్రతిపక్షాలు జిల్లాల స్ధాయి లో చేసే ఆరోపణలు, విమర్శలకు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇవ్వటకోసం రెడీ చేస్తున్నారట. మొదటి బృందంలో సజ్జల రామకృష్ణారెడ్డి, రోజా, బొత్సా సత్యనారాయణ, అంబటి రాంబాబు, అమర్నాధ్, విజయసాయిరెడ్డి, జోగి రమేష్, కొడాలినాని, పేర్నినాని లాంటి వాళ్ళున్నారు. ఇక రెండో బృందంలో జిల్లాల స్ధాయి లో బాగా మాట్లాడగలిగిన ఎంఎల్ఏలు, ఎంపీలు, సీనియర్ నేతలను నియమించాలని జగన్ డిసైడ్ చేశారట.
నిజానికి ప్రత్యర్ధుల మీద ఆరోపణలు, విమర్శలు చేయటం లో తెలుగుదేశం పార్టీ నేతల కు మించిన పార్టీ లేదు. విషయం ఏదైనా ఒక పద్దతి ప్రకారం వ్యవహరిస్తారు. మీడియా ను ఉపయోగించుకోవటంలో తమ్ముళ్ళ తర్వాతే ఇంకెవరైనా. వైసీపీ నేతల్లో అత్యధికులు కాంగ్రెస్ డీఎన్ఏ నే కాబట్టి మీడియా ను పెద్దగా పట్టించుకోరు. కానీ ఇప్పటి పరిస్ధితుల్లో మీడియా అండలేకుండా పార్టీలు మనుగడ సాగించటం కష్టమే. అందుకనే మీడియా కు ప్రాధాన్యత బాగా పెరిగిపోతోంది.
ఇవన్నీ దృష్టి లో ఉంచుకునే జగన్ ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శల ను ఎప్పటికప్పుడు తిప్పికొట్టడం కోసమే రెండు బృందాల ను ఏర్పాటుచేస్తున్నారు. రాబోయేది ఎన్నికల కాలమే కదా ఇపుడు కూడా పార్టీ తరపున సమాధానాలు చెప్పేవాళ్ళు లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని జగన్ కు అర్ధమైనట్లుంది.
అందుకనే ఇంతకాలానికి ఎదురుదాడి బృందాల ను రెడీ చేయాలని అనుకుంటున్నారు. మరి మంత్రులు, మాజీలు చెప్పే వివరణలు జనాల్లోకి ఎంత వరకు సక్సెస్ ఫుల్ గా వెళతాయో చూడాల్సిందే. రాబోయే ఎన్నికలకు సంబంధించి ఓట్లేసే విషయం లో జనాలు ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చేసుంటారు. మరి ఎదురుదాడి బృందాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాల్సిందే.