Begin typing your search above and press return to search.

జగన్ మామ అంటూ ఆశ్చర్యపరిచిన చిన్నారి

By:  Tupaki Desk   |   8 Oct 2020 10:50 AM GMT
జగన్ మామ అంటూ ఆశ్చర్యపరిచిన చిన్నారి
X
ఏపీ సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా భావించిన ‘జగనన్న విద్యా కానుక’ను ఈరోజు శ్రీకారం చుట్టారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు జడ్పీ పాఠశాలలో ‘జగనన్న విద్యాకానుక’ పథకాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. తొలుత పునాదిపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ లో నాడు-నేడుపనులను పరిశీలించిన సీఎం జగన్.. విద్యార్థులను ప్రేమగా.. అప్యాయంగా పలకరించి కాసేపు వారితో మాట్లాడారు.

ఇప్పటివరకు దేశంలో ఎక్కడా లేని విధంగా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థిని, విద్యార్థులకు ప్రత్యేక స్కూల్ కిట్ ల పంపిణీని చేపట్టారు. సభా వేధికపై ఒక విద్యార్థి ‘జగన్ మామ’ అంటూ ప్రసంగించి సభకులందరినీ కట్టిపడేసేలా ప్రసంగించింది. సీఎం జగన్ సైతం నవ్వుతూ చిన్నారి ప్రసంగానికి ఉప్పొంగిపోయారు చివర్లో దగ్గరికి తీసుకొని ముద్దు కూడా పెట్టారు.

ఈ సందర్భంగా బాలిక మాట్లాడుతూ ‘జగనన్న పేద విద్యార్థుల కోసం నాడు నేడు పాఠశాలలు బాగు చేయించారని.. మధ్యాహ్నం పౌష్టికాహారం అందించారని.. ఇప్పుడు జగనన్న విద్యా కానుక పేరిట స్కూల్ కిట్ లు ఇస్తున్నారని’ చెప్పుకొచ్చింది. కాన్వెంట్, కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా విద్యనందిస్తున్న జగన్ గారి ఆశయాన్ని తాను నెరవేర్చి కలెక్టర్ అయ్యి ఇదే జగనన్న పథకాలను పేద ప్రజలకు అందిస్తానంటూ ప్రసంగించింది. అప్పటివరకు సీఎంగా జగన మావయ్యా ఉండాలంటూ గొప్పగా ప్రసంగించింది.

4వ తరగతి విద్యార్థిని చేసిన ప్రసంగం అందరినీ అలరించింది. సభికులంతా చప్పట్లతో చిన్నారిని అభినందించారు. జగన్ స్వయంగా ముద్దు పెట్టుకొని ఆశీర్వదించారు.