Begin typing your search above and press return to search.
జగనన్నే మా భవిష్యత్తు.. తొలి రోజు ప్రజలు ఏమన్నారంటే!
By: Tupaki Desk | 8 April 2023 3:05 PM GMTజగనన్నే మా భవిష్యత్తు పేరిట వైసీపీ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త కార్యక్రమానికి తొలి రోజే ప్రజల నుంచి నిరసన సెగ ఎదురైంది. ఏప్రిల్ 7 నుంచి 20 వరకు జగనన్నే మా భవిష్యత్తు పేరిట వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇంచార్జులు ఇంటింటికీ తిరుగుతున్నారు. వీరితోపాటు సచివాలయానికి ముగ్గురు చొప్పున నియమించిన కన్వీనర్లు, ప్రతి 50 ఇళ్లకు నియమించిన గృహ సారథులు ఇంటింటికీ తిరిగి ప్రజల నుంచి సమాచారం సేకరించారు.
ప్రజాధనాన్ని వలంటీర్లకు వేతనాలుగా ఇస్తున్న నేపథ్యంలో వలంటీర్లను పార్టీ కార్యక్రమాలకు వాడొద్దనే నిబంధనలు ఉన్నా వైసీపీ నేతలు లక్ష్యపెట్టలేదు. స్వయంగా వలంటీర్లే గృహసారథులను, సచివాలయ కన్వీనర్లను వెంట బెట్టుకుని ప్రతి ఇంటికీ తిరిగారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా? జగనన్న ప్రభుత్వం బాగా పనిచేస్తోందా? ఈ పథకాలనే కొనసాగించాలని కోరుకుంటున్నారా? ఈ పథకాలు కొనసాగాలంటే జగనన్న ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారా వంటి ప్రశ్నలను ప్రజల నుంచి అడిగి ప్రజాప్రతినిధులు సమాధానాలు రాబట్టారు.
ఇందులో భాగంగా ప్రతి ఇంటికీ, ప్రజల సెల్ ఫోన్లకు.. మా నమ్మకం నువ్వే జగన్ పేరిట స్టిక్కర్లు అంటించడానికి వైసీపీ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. అయితే ప్రజలు చాలాచోట్ల స్టిక్కర్లు అంటించవద్దని వైసీపీ నేతల ముఖానే చెప్పారు.
ధరలు పెంచేశారని, పథకాలు అందడం లేదని, వస్తున్న పథకాలను ఏదో కారణాలు చెప్పి మధ్యలోనే ఆపేస్తున్నారని జనం వైసీపీ ఎమ్మెల్యేలను నిలదీశారు. తమ సెల్‌ఫోన్లకే కాదు.. ఇంటికీ స్టిక్కర్లు అంటించొద్దని చాలాచోట్ల వ్యతిరేకించారు. వైసీపీ నేతలు ఒత్తిడి చేసి అంటించినా వాళ్లు వెళ్లగానే వాటిని చింపేశారు.
ప్రజాధనాన్ని వేతనాలుగా పొందుతున్న వాలంటీర్లను పార్టీ ప్రచారానికి తీసుకెళ్లడమేంటని విమర్శలు వెల్లువెత్తినా వైసీపీ ఎమ్మెల్యేలు లక్ష్యపెట్టలేదు. చాలాచోట్ల స్టిక్కర్లూ వాళ్లే అతికించారు. స్టిక్కర్లు వద్దంటున్నవారి వివరాలను ప్రత్యేకంగా నమోదు చేసుకోవడం గగమనార్హం.
తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైసీపీ ఇంచార్జి రామ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లినప్పుడు.. మూడు నెలలుగా నీళ్లు రావడం లేదని కందాల జ్యోతి అనే మహిళ ఆయనపై మండిపడింది. ఉపాధ్యాయులకు ఈ ప్రభుత్వం ఏం చేసిందంటూ విశ్రాంత ఉపాధ్యాయిని రాజేశ్వరమ్మ ప్రశ్నించారు.
అలాగే శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎన్టీఆర్ కాలనీలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను మహిళలు నిలదీశారు. నాలుగు నెలలుగా రేషన్ బియ్యం సరిగా ఇవ్వడం లేదని కొందరు మహిళలు మండిపడ్డారు. సాయంత్రం తన ఇంటికి వస్తే మాట్లాడదామని ఎమ్మెల్సీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. రేషన్ డిపో బాధ్యతలు చూస్తున్న వ్యక్తి అక్కడే ఉన్నా ఎమ్మెల్సీ తమ సమస్యను కనీసం పట్టించుకోలేదని మహిళలు ధ్వజమెత్తారు.
కాలనీ సమస్యలు పరిష్కరించాలని నాలుగేళ్లుగా అడుగుతున్నా ఒక్క సమస్యనూ పరిష్కరించలేదని ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో గృహ సారథులను కాలనీ వాసులు నిలదీశారు. దీంతో వారు స్టిక్కర్లు అంటించకుండానే వెనుదిరిగారు.
విజయవాడ మధ్య నియోజకవర్గంలోని రాధానగర్ ప్రాంతంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు వాలంటీర్లతో కలిసి వెళ్లగా స్థానికుల నుంచి ప్రతిఘటన ఎదురవడంతో పోలీసులు ఆయనకు బందోబస్తుగా వచ్చారు. కొందరు స్థానికులు సెల్ ఫోన్లపై జగన్ స్టిక్కరును అతికించుకునేందుకు నిరాకరించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.