Begin typing your search above and press return to search.

ప్రత్యేక హోదా కోసం అడుగూతేనే ఉంటా: జగన్

By:  Tupaki Desk   |   15 Aug 2020 2:00 PM GMT
ప్రత్యేక హోదా కోసం అడుగూతేనే ఉంటా: జగన్
X
విజయవాడలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఏపీ సీఎం జగన్ నోటి వెంట మళ్లీ అదే పాట వినపడింది. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన జగన్ ఈ సందర్భంగా పోలీసు దళాల గౌరవాన్ని పొందారు. అయితే, సీఎం జగన్ తన ప్రసంగంలో ‘ప్రత్యేక హోదా’ ఏపీకి కావాల్సిందే అంటూ మరోసాని నొక్కి వక్కాణించారు.

“పార్లమెంటు సాక్షిగా, ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం విభజించబడిన సీమంధ్రకు‘ ప్రత్యేక హోదా ’ ఇస్తామని వాగ్దానం చేసింది. ఇప్పటికీ ఆరు సంవత్సరాలైంది.. వాగ్దానం నెరవేరలేదు. మా ఎంపీలు, ప్రభుత్వం ‘ప్రత్యేక హోదా’ గురించి కేంద్రాన్ని అడగడం కొనసాగిస్తాయని సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

“ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్లో పూర్తి మెజారిటీ ఉంది. బీజేపీ దేశంలోని ఇతర రాజకీయ పార్టీలపై ఆధారపడదు. కాబట్టి ‘ప్రత్యేక హోదా’ వెంటనే మంజూరు కాదు. కానీ దాని కోసం ఏపీ ప్రజల కోసం పోరాడాలని మేము నిశ్చయించుకున్నాం. ఇప్పుడే కాకపోతే, భవిష్యత్తులో కేంద్రం తన మనసు మార్చుకుంటుందని ఆశిస్తున్నారు. తప్పకుండా ‘ప్రత్యేక హోదా’ మంజూరు చేస్తుందని నేను ఆశిస్తున్నాను ”అని జగన్ ఆకాంక్షించారు.

ఇక ఈ ప్రసంగంలో ఏపీ సీఎం తన 14 నెలల పాలన గురించి ప్రస్తావించారు. "ఆర్థిక అస్థిరత ఉన్నప్పటికీ, మన ప్రభుత్వం పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. గత 14 నెలల్లో రూ .46,000 కోట్లు ఖర్చు చేశామని జగన్ వివరించారు. ఈ పథకాలు కేవలం ఎన్నికల కోసమే కాదని.. రాబోయే సంవత్సరాల్లో ఈ పథకాల ఫలాలు ప్రజలు పొందుతారు ”అని జగన్ అన్నారు.

‘మూడు రాజధానుల’పై జగన్ మాట్లాడుతూ త్వరలో వైజాగ్ రాష్ట్ర కార్యనిర్వాహక రాజధానిగా మారనుందని.. కర్నూలుకు జ్యుడిషియల్ క్యాపిటల్‌గా పునాది రాయి వేస్తామని తెలిపారు.