Begin typing your search above and press return to search.
సింగిల్.. సింహం.. మాటల్నిఇప్పటికైనా వదిలేస్తారా?
By: Tupaki Desk | 19 March 2023 9:00 PM GMTసినిమా డైలాగుల్ని వెండితెర మీద చూస్తూ ఎంజాయ్ చేయాలి. లేదంటో.. ఇంట్లో టీవీలో వింటూ ఉండాలే తప్పించి..నిజ జీవితంలో అప్లై చేస్తే వచ్చే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ఎంత బలవంతుడైనా సరే.. తొడ కొడితే.. పక్కనున్నోడికి కూడా సరిగా వినిపించదు. కానీ.. వెండితెర మీద చూసినప్పుడు ఆ చుట్టుపక్కల వారంతా వణికిపోయేలా సౌండ్ ఎఫెక్టు ఉంటుంది. అలాంటి ప్రయత్నమే నిజ జీవితంలో చేస్తే సౌండ్ తర్వాత.. తొడల మీద వాతలు ఖాయం. అలానే.. సింహం సింగిల్ గా వస్తుందంటూ అంత్యప్రాసతో కూడిన సినిమా డైలాగులు వినేందుకు బాగానే ఉంటాయి కానీ ఆచరణలో మాత్రం అందుకు చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుంది.
ఈ విషయం వైసీపీ అధినాయకత్వానికి.. ఇతర నేతలకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. కాలం.. బలం ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. వాటిని మదింపు చేసే విషయంలో జరిగే పొరపాట్లతో వాటిల్లే నష్టం తీవ్రంగా ఉంటుంది. సింహం సింగిల్ గా వస్తుంది.. పందులే గుంపులుగా వస్తాయంటూ సినిమాల్లో హీరోను ఎలివేట్ చేయటానికి వాడే డైలాగ్ వినేందుకు బాగానే ఉంటుంది. హీరోను అంతలా ఎలివేట్ చేయటానికి.. స్క్రిప్టు రైటర్.. దర్శకుడు.. కెమేరామెన్.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడంత మంది పని చేస్తారు. అంటే.. ఒకరు హీరోగా ఎలివేట్ కావాలంటే అందుకు ఎంతోమంది తీవ్రంగా కష్టపడాల్సి ఉంటుంది.
ఆ విషయాన్ని వదిలేసి.. సినిమా డైలాగులు చెబుతూ.. తమ బలాన్ని తామే అతిగా ఊహించుకుంటూ పోతే జరిగే నష్టం ఎంతన్నది తాజాగా వెల్లడైన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితం చెప్పేసింది. మూడు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో సింగిల్ గా వెళ్లి.. ఎవరితోనూ పొత్తు పెట్టుకోవటానికి.. మాట్లాడుకోవటానికి సిద్ధంగా లేనితనం ఈ రోజున మూడింటిలోనూ మునిగిపోయేలా చేసింది. సింగిల్.. సింహం అనే జగన్ అండ్ కో 2019లో జరిగిన ఎన్నికల్లో ప్రత్యక్షంగా కాకున్నా.. పరోక్షంగా మోడీ.. కేసీఆర్.. పోలీసులు.. ఇతర కీలక అధికారుల అండ లేకుండానే చారిత్రక విజయం సాధించారా? అన్న ప్రశ్నను సంధించుకుంటే సమాధానం వైసీపీలోని ప్రతి ఒక్కరికి తెలుసు.
2019లో లేని సింగిల్.. సింహం మాటలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు? అన్నది ప్రశ్న. తాజాగా పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల విషయాన్నే తీసుకుంటే.. ఎవరితోనూ.. ఏ పక్షంతోనూ అవగాహన కుదుర్చుకోవటానికి జగన్ ఆసక్తి చూపలేదు. అదే సమయంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. త్రిముఖ పోటీ జరుగుతున్న ఈ ఎన్నికల్లో కేవలం మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలవటం సాధ్యం కాదన్న విషయాన్ని గ్రహించిన చంద్రబాబు అందుకు తగ్గట్లే ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
వామపక్షాలతో సంప్రదింపులు జరిపి.. టీడీపీ.. పీడీఎఫ్ కూటమి ద్వితీయ ప్రాధాన్యం ఓటు పరస్పరం వేసుకునేలా అంగీకారానికి వచ్చారు. చంద్రబాబు చేసిన ఈ ఆలోచనను పార్టీలోని కొందరు వ్యతిరేకించారు. ఇలా చేయటం ద్వారా ప్రత్యర్థిపై సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుందని.. అదే జరిగితే మొదటికే మోసం వస్తుందన్న వాదనలు వినిపించారు. అనవసరంగా గందరగోళం చోటు చేసుకుంటున్న మాటా వినిపించింది.
అయితే.. వారి మాటల్ని పరిగణలోకి తీసుకోని చంద్రబాబు.. తాను ఎంచుకున్న మార్గంలోనే పయనించారు. అనుకున్నది సాధించారు. ఓట్ల లెక్కింపు వేళ.. ఆయన అంచనాలకు తగ్గట్లే జరగటం.. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేసుకొని ఉండటం ద్వారా.. ఎన్నికల్లో సులువుగా విజయం సాధించేందుకు సాయం చేసింది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు వేళ.. పీడీఎఫ్ కు ఓటు వేసిన వారిలో అత్యధికులు టీడీపీకి తమ రెండో ప్రాధాన్యత ఓటు వేయటంతో.. విజయం టీడీపీ పక్షాన నమోదైంది. అందుకే.. సింహం.. సింగిల్ లాంటి మాటలు మాట్లాడుకోవటానికి.. సినిమా డైలాగులుగా పనికి వస్తాయే తప్పించి.. రోజువారీ జీవితంలో వర్కువుట్ కావన్న సత్యాన్ని గుర్తిస్తే.. వచ్చే ఎన్నికల్లో జగన్ మరింత నష్టపోకుండా ఉంటారని చెప్పాలి. లేని పక్షంలో జరగాల్సింది జరగకుండా ఉండదనుకోండి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.