Begin typing your search above and press return to search.
పొలిటికల్ హీట్: జగన్ కు జీవీఎల్ వార్నింగ్
By: Tupaki Desk | 5 Feb 2020 10:50 AM GMTఏపీకి ప్రత్యేక హోదా.. ఇదో చిరకాల వాంఛ.. రాజధాని లేకుండా కట్టుబట్టలతో విడిపోయిన ఏపీకి నాడు హోదా ఇప్పిస్తానని గద్దెనెక్కిన చంద్రబాబు దాన్ని సాధించలేకపోయారు.. బీజేపీని ఎదురించారు.. ఓడిపోయారు. ఇప్పుడు అదే హోదాను సాధిస్తానని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. తాజాగా ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు.
అయితే తాజాగా ఇదే ప్రతిపాదనను జగన్ తెచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఏపీ సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాయడంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు సీరియస్ అయ్యారు. జగన్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ప్రత్యేక హోదా అనేది అంతరించిపోయిన వ్యవస్థ అని.. గత టీడీపీ లాగే బీజేపీపై హోదా పేరుతో నిందలు వేయడానికి ప్రయత్నిస్తే టీడీపీ ఎదుర్కొన్న పరిణామాలనే జగన్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని జీవీఎల్ గట్టి హెచ్చరిక చేశారు. లేని వ్యవస్థల కోసం మాట్లాడితే రాజకీయంగా ఇబ్బంది తప్పదు అంటూ జగన్ కు జీవీఎల్ వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది.
ఏపీకి ప్రత్యేక హోదాను ఇచ్చే ఉద్దేశం కేంద్రానికి లేదని.. రాదని కూడా జగన్ కు తెలుసు అని.. అయినా కోరితే బాబు గతే పడుతుందని జీవీఎల్ హెచ్చరించారు.
చంద్రబాబు సైతం హోదాపేరుతో బీజేపీపై బురద జల్లి ఓట్లు రాబట్టుకొనే ప్లాన్ చేశారు. అయితే బీజేపీ ప్రతి వ్యూహంతో ఇప్పుడు ఎటూ కాకుండా ఓడిపోయారు. అందుకే తాజాగా హోదా గురించి నినదించిన జగన్ కు అదే హెచ్చరికను బీజేపీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.