Begin typing your search above and press return to search.

జగన్‌ రావడం ఖాయం: అధికారుల అంచనా

By:  Tupaki Desk   |   18 Feb 2019 11:33 AM IST
జగన్‌ రావడం ఖాయం: అధికారుల అంచనా
X
ఆంధ్రప్రదేశ్‌ లో రానున్న ఎన్నికలలో తెలుగుదేశం ప్రభుత్వం మారడం ఖయామని ప్రభుత్వ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. జగన్ పాదయాత్ర నుంచి విమానాశ్రయంలో ఆయనపై దాడి - బీసీ గర్జన విజయవంతం కావడం వంటి అంశాలను బేరీజు వేసుకుంటున్న అధికారులు రానున్న ఎన్నికలలో వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడం తథ్యమని భావిస్తున్నట్లు సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగిన వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ గర్జన జగన్మోహాన రెడ్డి విజయాన్ని ఖాయం చేసిందని అధికారులు అంచనా వేస్తున్నారు. బీసీ గర్జనకు వచ్చిన వారంతా జగన్‌ పై అభిమానంతోను - ప్రభుత్వ వ్యతిరేకత తోను ఉన్నవారేనని వారు అంటున్నారట‌. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ సదస్సుకు బస్సులు - భోజనాలు - ఇతర సదుపాయాలు కల్పించినా వైఎస్‌ ఆర్ సీపీ బీసీ గర్జనకు వచ్చిన వారితో పోలిస్తే నాలుగైదు రెట్లు తక్కువేనని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇక ఎన్నికలకు మూడు నెలలే గడువు ఉండడంతో ప్రస్తుత ప్రభుత్వంతో ఎలా మసలుకోవాలి, ప్రభుత్వ నిర్ణయాలకు ఎలా స్పందించాలి వంటి అంశాలపై ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. రానున్న ఈ మూడు నెలలు కరిస్తే కప్పకు కోపం.... విడిస్తే పాముకు కోపం అన్న తీరుగా ఉంటుందని ఉన్నతాధికారులు వాపోతున్నార‌ట‌. తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయాలను కఠినంగా అమలు చేస్తే ఆ పార్టీ అధికారంలోకి రాకపోతే చిక్కులు తప్పవేమోనని అధికారులలో ఆందోళన కలిగిస్తోంది. రానున్న మూడు నెలలు ఐఏఎస్ - ఐపిఎస్ అధికారులతో పాటు ఇతర శాఖల అధికారులు కూడా అప్రమత్తంగా వ్యవహ‌రించాల్సి ఉంటుందని భావిస్తున్నారు. కొందరు అధికారులు ఇప్పటికే తమకు పరిచయం ఉన్న వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ పార్టీ సినీయర్ నాయకులతో టచ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటి నుంచే పార్టీ నాయకులను ప్రసన్నం చేసుకుంటే భవిష్యత్తులో వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎలాంటి చిక్కులు ఉండవని భావిస్తున్నారు.