Begin typing your search above and press return to search.
ఆ ఎమ్మెల్యేల దోపిడీని కనిపెట్టిన జగన్!?
By: Tupaki Desk | 18 Dec 2021 12:30 AM GMTఎంఎల్ఏల జాతకాలు జగన్మోహన్ రెడ్డి దగ్గర కొత్తగా ఉండటం ఏమిటనే సందేహం వచ్చిందా. అవును మీ సందేహం నిజమే. కాకపోతే ఇపుడు చెప్పే జాతకాలు అవినీతిపరులైన ఎంఎల్ఏల జాతకాలట.
వివిధ కారణాలతో కొందరు ఎంఎల్ఏలు డబ్బు సంపాదనలో బిజీగా ఉన్నట్లు పార్టీలో చర్చ మొదలైంది. ఇదే విషయమై నిఘావర్గాలు కూడా కొందరు ఎంఎల్ఏల అవినీతి వ్యవహారాలను జగన్ ముందుంచాయట.
వివిధ జిల్లాల్లోని కొందరు ఎంఎల్ఏల అవినీతి వ్యవహారాలతో ఇంటెలిజెన్స్ వర్గాలు జగన్ కు ఈ మధ్యనే ఒక రిపోర్టు ఇచ్చిందని సమాచారం. కడప, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని తలా ఒక ఎంఎల్ఏ అవినీతిపై ప్రధానంగా రిపోర్టులో ప్రస్తావన ఉందని పార్టీలోనే చర్చ జరుగుతోంది.
మొన్నిటి ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన వారిలో కేవలం జగన్ గాలి ఆధారంగా గెలిచిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో కొందరు అవినీతికి లాకులెత్తినట్లు ఆరోపణలున్నాయి.
డీఎస్పీల బదిలీలు, ఇసుక అక్రమ రవాణా, కాంట్రాక్టులు తదితర రూపాల్లో కొందరు ఎంఎల్ఏలు అవినీతికి పాల్పడుతున్న వారి జాబితా ఇపుడు జగన్ చేతికి వచ్చిందట.
వీరితో పాటు ప్రజలు, క్యాడర్ తో మంచి సంబంధాలు లేని వాళ్ళు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వారిని కూడా జగన్ గుర్తించే కార్యక్రమం మొదలుపెట్టినట్లు పార్టీలోనే చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి వారిలో వచ్చే ఎన్నికల్లో ఎంతమందికి జగన్ టికెట్లిస్తారనేది డౌటుగా మారింది.
నెల్లూరు జిల్లాలోని ఓ ఎంఎల్ఏ అవినీతిపైన రాజ్యసభ ఎంపీనే జగన్ తో ఫిర్యాదుచేశారట. అలాగే గుంటూరులోని ఒక ఎంఎల్ఏ అవినీతిపై పార్టీ నేతలే సీఎం దృష్టికి తెచ్చారట.
తన చేతిలో ఉన్న రిపోర్టుల విషయంలో జగన్ కూడా కాస్త సీరియస్ గా నే ఉన్నట్లు సమాచారం. మొన్నటి ఎన్నికలంటే పాదయాత్రలో పాల్గొన్నారని, సామాజికవర్గాల సమీకరణలనే తదితర కారణాలతో జగన్ చివరినిముషంలో కూడా టికెట్లను ఇవ్వాల్సొచ్చింది.
కానీ వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తారని నమ్మకం ఉన్నవారికి మాత్రమే టికెట్లివ్వాలని జగన్ డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే నియోజకవర్గాల వారీగా ఎంఎల్ఏల పనితీరు, వ్యవహారశైలి, ప్రజలు, క్యాడర్ తో సంబంధాల్లాంటి వాటి విషయంలను ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నారు. కాబట్టి అవినీతికి పాల్పడుతున్న ఎంఎల్ఏల్లో ఎంతమందికి మళ్ళీ టికెట్లిస్తారనేది అనుమానమే.