Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ చేతి వాచీ ఎవ‌రిదో తెలుసా?

By:  Tupaki Desk   |   30 May 2019 8:57 AM GMT
జ‌గ‌న్ చేతి వాచీ ఎవ‌రిదో తెలుసా?
X
ఏపీ ముఖ్య‌మంత్రిగా తాజాగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. గ‌డిచిన తొమ్మిదేళ్లుగా తెలుగు ప్ర‌జ‌ల‌కు సుప‌రిచితుడు. పార్టీని పెట్టి.. ఎన్నో ఎదురుదెబ్బ‌లు.. ఆటుపోట్లు తిన్న జ‌గ‌న్‌.. తాజాగా ఏపీకి సీఎం అయ్యారు. గ‌డిచిన తొమ్మిదేళ్లుగా ప్ర‌జ‌ల్లో మ‌మేక‌మైన ఆయ‌న ఆహార్యం చాలా సింఫుల్ గా ఉంటుంది.

నార్మ‌ల్ చొక్కా.. ఫ్యాంటుతో ఉండే ఆయ‌న‌.. త‌న ఫుల్ హ్యాండ్స్ చేతుల్ని కాస్త పైకి ఎత్తి.. క‌బ్ ను మ‌డ‌త పెడుతుంటారు. ఆ సంద‌ర్భంగా ఆయ‌న చేతులు బోసిగా క‌నిపిస్తాయి. ఎలాంటి వాచీ ఆయ‌న చేతికి క‌నిపించ‌దు. క‌ట్‌. చేస్తే.. ఈ రోజు ఏపీకి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన జ‌గ‌న్‌.. చేతికి ఒక వాచీ క‌నిపించింది. ఇది కొంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

ఎప్పుడు చేతికి ఏమీ పెట్టుకోని జ‌గ‌న్‌.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా వాచీ పెట్టిన వైనం క‌నిపిస్తుంది. ఇంత‌కీ ఆ వాచీ ఎవ‌రిదన్న ప్ర‌శ్న వేసుకుంటే ఆస‌క్తిక‌ర స‌మాధానం వ‌స్తుంది. ఆ వాచీ దివంగ‌త మ‌హానేత.. త‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పెట్టుకునే వాచీని తొలిసారి జ‌గ‌న్‌.. పెట్టుకున్నారు. తండ్రి వాచీని పెట్టుకొని ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి రావ‌టం విశేషంగా చెప్పాలి.