Begin typing your search above and press return to search.
న్యూజిలాండ్ కు ఫ్యామిలీ ట్రిప్ వేసిన జగన్
By: Tupaki Desk | 26 May 2017 7:05 AM GMTతెలుగు రాష్ర్టాల్లో ఎండలు మండిపోతున్నాయి... బయటకొస్తే భగభగే. తెలంగాణ అయినా, కోస్తా అయినా, రాయలసీమ అయినా, ఎక్కడైనా ఇదే పరిస్థితి. దీనికి తోడో నేతలకు రాజకీయ వేడి అదనం. అందుకే ఆ వేడి, ఈ వేడి రెండింటి నుంచి కాస్త ఉపశమనం కోసం, కొద్ది రోజుల పాటు ప్రశాంతంగా గడపడానికి వైసీపీ అధ్యక్షుడు జగన్ కుటుంబం తో సహా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లారు. పదిహేను రోజుల పాటు ఆయన రాజకీయాలకు గ్యాప్ ఇస్తూ న్యూజిలాండ్ లో గడపనున్నారు. తిరిగి జూన్ 10న ఆయన రాష్ర్టానికి రానున్నారు.
గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టులో కుటుంబసభ్యులతో కలిసి సింగపూర్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో న్యూజిలాండ్ కు బయలుదేరారు. పలువురు వైకాపా నేతలు ఆయనకు వీడ్కోలు పలికారు. రెండు వారాల పాటు జగన్ న్యూజిలాండ్ లో గడపనున్నారు.
కాగా, తాను న్యూజిలాండ్ కు వెళ్లేందుకు అనుమతించాలని గత నెలలో జగన్ కోర్టు అనుమతిని కోరగా సీబీఐ అందుకు అడ్డం పడింది. అయితే, కోర్టు ఆ అభ్యంతరాలను తిరస్కరిస్తూ, కుటుంబ సభ్యులను తీసుకుని విదేశాలకు వెళ్లదలిస్తే సరేనని అనుమతులు ఇచ్చింది. దాంతో కోర్టు అనుమతితోనే జగన్ ఇప్పుడు న్యూజిలాండ్ వెళ్లారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/