Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ క‌ల‌!.. ఏపీకి సీఎం కావ‌డ‌మే!

By:  Tupaki Desk   |   2 March 2019 10:52 AM GMT
జ‌గ‌న్ క‌ల‌!.. ఏపీకి సీఎం కావ‌డ‌మే!
X
ఏపీ అసెంబ్లీలో విప‌క్ష నేత‌, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి... పోల్ మేనేజ్ మెంట్ ను ప‌క్కాగా అమ‌లు చేసి ఉంటే ఇప్ప‌టికే సీఎం అయిపోయి ఉండేవారు. జ‌నంలో మంచి మైలేజీ ఉన్నా... దానిని ఓట్ల రూపంలో రాబ‌ట్టుకోలేక గ‌డ‌చిన ఎన్నిల్లో వెంట్రుక వాసిలో అధికారానికి దూరంగా నిల‌బ‌డిపోయిన జ‌గ‌న్‌... ఈ ద‌ఫా ఎలాగైనా స‌రే సీఎం కుర్చీలో కూర్చోవాల్సిందేన‌ని గ‌ట్టిగానే నిర్ణ‌యించుకున్నారు. అందుకోస‌మే... ఏడాదికి పైగా 3,600 కిలో మీట‌ర్ల‌కు పైగా ప్రజా సంక‌ల్ప యాత్ర పేరిట సుదీర్ఘ పాద‌యాత్ర‌ను చేప‌ట్టిన జ‌గ‌న్‌... ఇటీవ‌లే దానిని ముగించారు. ఆ త‌ర్వాత కూడా ఏమాత్రం రెస్ట్ తీసుకునేందుకు స‌సేమిరా అంటున్న జ‌గ‌న్ ఎక్క‌డ ఉన్నా.. మ‌రో రెండు నెలల్లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌పైనే దృష్టి సారిస్తున్నారు.

ఎన్నిక‌ల్లో తానొక్క‌డే కాకుండా త‌న పార్టీ అభ్య‌ర్థులు కూడా గెలిస్తేనే త‌న క‌ల ఫ‌లిస్తుంద‌న్న స‌త్యాన్ని గ్ర‌హించిన జ‌గ‌న్‌... గెలుపు గుర్రాల‌కే టికెట్లు కేటాయిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలో నిన్న ఢిల్లీ వెళ్లిన జ‌గ‌న్... అక్క‌డ నిన్న ప్రారంభమైన ఇండియా టుడే కాన్‌ క్లేవ్‌ లో నేటి ఉద‌యం కీల‌క ప్ర‌సంగం చేశారు. ఇండియా టుడే ప్ర‌తినిధి అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు క్లిస్ట‌ర్ క్లియ‌ర్ గానే స‌మాధానాలు చెప్పిన జ‌గ‌న్‌... త‌న క‌ల ఏమిట‌న్న విష‌యాన్ని కూడా సుస్ప‌ష్టం చేశార‌నే చెప్పాలి. ఏపీకి సీఎం కావ‌డ‌మే త‌న క‌ల‌గా అభివ‌ర్ణించిన జ‌గ‌న్‌.. దానినే త‌న క‌ల‌గా ఎందుకు ఎంచుకున్నాన‌న్న విష‌యాన్ని కూడా వివ‌రించారు. చ‌నిపోయినా ప్ర‌జ‌ల గుండెల్లో క‌ల‌కాలం నిల‌వాల‌న్న కోరిక‌తోనే తాను ఏపీకీ సీఎం కావాల‌ని క‌ల‌లు కంటున్నాన‌ని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు.

రాష్ట్రానికి సీఎం అయిన త‌ర్వాత ప్ర‌జ‌ల‌కు చాలా చేయాల్సి ఉంద‌ని, తాను అధికారంలోకి వ‌స్తే... త‌మ‌కు మేలు జ‌రుగుతుంద‌న్న భావ‌న కూడా ప్ర‌జ‌ల్లో వ‌చ్చేసింద‌ని కూడా జ‌గ‌న్ చెప్పారు. పాద‌యాత్ర సందర్భంగా ప్ర‌జ‌ల్లో ఈ మార్పు త‌న‌కు క‌నిపించింద‌ని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. మొత్తంగా తాను సీఎం కావాల‌న్న క‌ల తీర‌బోతోంద‌ని, ఇక ప్ర‌జ‌ల‌కు ఏం చేయాల‌న్న‌దే మిగిలింద‌ని చెప్పిన జ‌గ‌న్‌.. ప్ర‌జ‌ల‌కు ఏం చేస్తే బాగుంటుంద‌న్న విష‌యంపై ఇప్ప‌టికే ఓ స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న‌కు వ‌చ్చాన‌ని, సీఎం కాగానే దానిని అమ‌ల్లోకి తీసుకొచ్చేస్తాన‌ని చెప్పారు. త‌ద్వారా తాను క‌ల‌గంటున్న‌ట్టుగా జ‌నం గుండెల్లో చిర‌కాలం నిలిచిపోతాన‌ని కూడా జ‌గ‌న్ ధీమా వ్య‌క్తం చేశారు.