Begin typing your search above and press return to search.

తెలంగాణ పై జగన్ వ్యూహం ఏమిటి...

By:  Tupaki Desk   |   5 Sep 2018 10:17 AM GMT
తెలంగాణ పై జగన్ వ్యూహం ఏమిటి...
X
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ముందస్తు ఎన్నికలకు పచ్చ జేండా ఊపారు. ఇన్నాళ్లు ముందస్తుపై ఉన్న సస్పేన్స్‌ కు తెర తీసారు. అయితే తెలంగాణ రాష్ట్ర సమితీ పార్టీ తామూ ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని ఎన్నికలలో వంటరిగానే పోటీ చేస్తామని చెప్పింది. సమైకాంధ్రలో 9 సంత్సరాలు అధికారంలో ఉన్న తెలుగు దేశం పొత్తుల విషయమై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. అయితే తామూ తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలలోను పోటి చేస్తామని చినబాబు నారా లోకేష్ రెండు రోజుల క్రితం సెలవిచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ - కాంగ్రెస్‌ పార్టీలు కూడా ఎన్నికల బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.

ఈ పరిస్థితులలో వైఎస్ ఆర్ పార్టీ జగన్ మోహన రెడ్డి వ్యూహం ఏమిటీ అనేది అంతు చిక్కడం లేదు. ఆయన తన పార్టీ జెండాను తెలంగాణలో కూడా పాతనున్నారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. 2014 లో తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు వైఎస్ ఆర్ పార్టీ మాత్రం రాష్ట్ర విభజనను ఖండించింది. అంతే కాకుండా చివరి వరకూ ఆ మాట మీదే నిలబడింది కూడా. అయితే 2014 ఎన్నికలలో ఖమ్మం నుంచి వైరా నియోజకవర్గానికి చెందిన మదన్‌ లాల్ వైఎస్ ఆర్ కాంగ్రెస్ తరఫున పోటి చేసి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన టీఆర్ ఎస్‌ లో చేరారు. అయితే ఉద్యమ సమయంలో ఎంత సెంటిమేంట్ ఉన్నప్పటికీ వైఎస్ ఆర్ కాంగ్రెస్ గెలుపును సాధించిందంటే ఆ పార్టీకి తెలంగాణలో కొంచెం ఓటు బ్యాంకు ఉన్నట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ హావా మునపటి కంటే కొద్దిగా తగ్గినందును వైఎస్ ఆర్ సీపీకి ఓటు బ్యాంక్ పెరిగే అవకాశం ఉందని విశ్లేషకుల వాదన. అంతేకాకుండా తెలంగాణలోని రెడ్డి సామాజిక వర్గానికి సరైన నాయకుడు లేడని - వారంతా కూడా తమ సామాజిక వర్గం పటిష్ట పరిచేందుకు జగన్మోహన రెడ్డి లాంటి నాయకుడు కావలని అనుకుంటున్నారని పరిశీలకులు అంటున్నారు. అంతే కాక దివంగత నేత వైఎస్‌ రాజశేఖర రెడ్డికి ప్రజలలో ఇంక సానుభూతి ఉంది. తమ ప్రియతమ నేత కుమారుడైన జగ న్మోహన రెడ్డి పైన కూడా అంతే అభిమానం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇదంతా చూస్తుంటే జగన్‌ కు తెలంగాణలో అనుకూల పవనాలు ఉన్నట్లు కనిపిస్తోంది. త్వరలో తెలంగాణలో జరగబోయే ఎన్నికలలో వైఎస్ ఆర్‌ కాంగ్రెస్ పార్టీ పోటి చేస్తుందని ఆశీద్దాం.