Begin typing your search above and press return to search.

జగన్ మార్కు బదిలీలు..నిన్న ఐఏఎస్ లు - నేడు ఐపీఎస్ లు

By:  Tupaki Desk   |   6 Jun 2019 4:16 AM GMT
జగన్ మార్కు బదిలీలు..నిన్న ఐఏఎస్ లు - నేడు ఐపీఎస్ లు
X
నవ్యాంధ్రకు నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... పాలనలో తన మార్కును చూపించేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటికే ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన జగన్... బుధవారం ఐపీఎస్ అధికారుల బదిలీలను చేపట్టారు. గతంలో చంద్రబాబు హయాంలో కీలక స్థానాల్లో టీడీపీకి అనుకూలంగా తమదైన శైలిలో పనిచేసిన ఐపీఎస్ లకు ఈ బదిలీల ద్వారా జగన్ షాకిచ్చారనే చెప్పాలి. ప్రభుత్వం మారిన తర్వాత అధికారుల బదిలీలు సాధారణమే అయినా... చంద్రబాబు పాలనలో కీలక స్థానాల్లో టీడీపీలో సభ్యత్వం ఉన్నట్లుగా వ్యవహరించిన ఐపీఎస్ లకు అసలు పోస్టింగులే ఇవ్వలేదు. ఒకరిద్దరికి పోస్టింగులు ఇచ్చినా... పాలనలో అంతగా ప్రాధాన్యం లేని పోస్టులనే కేటాయించారు.

ఒకే సారి 25 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన జగన్... వారిలో చంద్రబాబు హయాంలో కీలక స్థానాల్లో ఉన్న వారికి ఫోకల్ పోస్టులు ఇవ్వలేదు. ఇంటెలిజెన్స్ విభాగంలో గతంలో కీలక భూమిక పోషించిన ఘట్టమనేని శ్రీనివాస్ ను అనంతపురం పీటీసీకి బదిలీ చేసేశారు. ఇక నాడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించిన ఏబీ వెంకటేశ్వరరావుకు కూడా ఇప్పటిదాకా పోస్టింగే ఇవ్వలేదు. ఇక తాను సీఎంగా ప్రమాణం చేసిన రోజే... బాబు హయాంలో సీఎంఓ లో పనిచేసిన నలుగురు ఐఏఏస్ లను ఒక్క దెబ్బతో బయటకు పంపేసిన జగన్... వారికి కూడా ఇప్పటిదాకా పోస్టింగులే ఇవ్వలేదు.

ఐపీఎస్ ల బదిలీ వివరాలు ఇలా ఉన్నాయి...

టి.వెంకట్రామిరెడ్డి -కర్నూలు రేంజ్ డీఐజీ
ఏఎస్ ఖాన్ -ఏలూరు రేంజ్ డీఐజీ
త్రివిక్రమవర్మ -సీఐడీ డీఐజీ
విశాల్ గున్ని -ఆక్టోపస్ ఎస్పీ
అశోక్ కుమార్ - ఇంటెలిజెన్స్ ఎస్పీ
సర్వశ్రేష్ట త్రిపాఠి -సీఐడీ ఎస్పీ
రవిప్రకాశ్ -ఎస్ ఐబీ ఎస్పీ
రాహుల్ దేవ్ శర్మ -గ్రేహౌండ్స్
కోయ ప్రవీణ్ - రైల్వే ఎస్పీ
ఘట్టమనేని శ్రీనివాస్ -అనంతపురం పీటీసీ
ఏఆర్ దామోదర్ -హెడ్ క్వార్టర్స్
భాస్కర్ భూషణ్ -హెడ్ క్వార్టర్స్
ఎస్వీ రాజశేఖర్ బాబు -హెడ్ క్వార్టర్స్
నవదీప్ సింగ్ -పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ
సీహెచ్ వెంకటప్పలనాయుడు -చిత్తూరు జిల్లా ఎస్పీ
అమ్మిరెడ్డి -శ్రీకాకుళం ఎస్పీ
విక్రాంత్ పాటిల్ -విశాఖ డీసీపీ1
ఉదయ్ భాస్కర్ బిల్లా -విశాఖ డీసీపీ2
బీహెచ్ పీ రామకృష్ణ -గుంటూరు జిల్లా ఎస్పీ
జయలక్ష్మి -గుంటూరు రూరల్ ఎస్పీ
బి.రాజకుమారి -విజయనగరం జిల్లా ఎస్పీ
నయీం హష్మీ - తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ
బి.సత్య ఏసుబాబు -అనంతపురం
సీహెచ్ విజయరావు -విజయవాడ డీసీపీ2
నాగేంద్రకుమార్ -విజయవాడ జాయింట్ సీపీ