Begin typing your search above and press return to search.
బ్రేకింగ్: 23న ఎమ్మెల్యేతో ఏపీ సీఎం మీటింగ్ !
By: Tupaki Desk | 19 March 2020 12:17 PM GMTఆంధప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి .. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లతో ఈ నెల 23 న (సోమవారం) ఒక భారీ మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు. సీఎం గా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తరువాత మంత్రులతో - విడివిడిగా ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు కానీ - మొత్తం పార్టీకి చెందిన 150 మంది ఎమ్మెల్యే లతో మీటింగ్ ఏర్పాటు చేయలేదు. దీనితో ఈ ఎమ్మెల్యేల భేటీపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
అయితే , ఈ మీటింగ్ ని సీఎం జగన్ ఎందుకు ఏర్పాటు చేయబోతున్నారు - అసలు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని పూర్తిగా తెలియకపోయినప్పటికీ కూడా ..విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి ..వైసీపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోని అమలు చేయదలచిన పథకం ..ప్రతి పేద వారికీ ఇంటి స్థలం పథకం. రాష్ట్రంలో సొంత ఇల్లు లేనివారంటూ ఉండకూడదు అని భావించి - అలాంటి వారిపై ఒక సమగ్ర సర్వే చేయించి - జిల్లాల వారీగా వారికీ కావాల్సినంత భూమిని ఇప్పటికే సిద్ధం చేసారు. ఈ పథకాన్ని ఉగాది పర్వదినం పురస్కరించుకొని ..మార్చి 25 న వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్ చేతులమీదుగా పెద్ద ఎత్తున ప్రారంభించాలని మొదటగా నిర్ణయించింది. మధ్యలో స్థానిక ఎన్నికలు రావడంతో ఈ కార్యక్రమం వాయిదా పడుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ , కరోనా కారణంగా స్థానిక ఎన్నికలు వాయిదా పడటంతో ..ఈ పథకాన్ని ఉగాది రోజునే ప్రారంభించబోతున్నారు.
అలాగే , ఉగాది అయిపోయిన మరుసటి రోజునే అంటే 26 వ తేదీన రాజ్యసభకు ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే , వైసీపీకి పూర్తి బలం ఉంది కాబట్టి ..వైసీపీ తరపున రాజ్యసభ బరిలో నిలిచిన వారు రాజ్యసభకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది. కాబట్టి , ఉగాది రోజున పెద్దవారికి ఇళ్ల స్థలాల పంపిణి , 26 న రాజ్యసభ ఎన్నికలు జరగబోతుండటంతో ..ఆ రెండు అంశాలపై పార్టీ ఎమ్మెల్యేలందరని పిలిచి, 23 న ఒక సమావేశం ఏర్పాటు చేసిన , ఆ సమావేశం లో ఆ రెండు రోజులపాటు నేతలందరూ ఏ విదంగా నడుచుకోవాలో దిశానిర్దేశం చేయబోతున్నారు అని సమాచారం. ఏదేమైనా కూడా రాజ్యసభ ఎన్నికల తరువాత ఏపీ కేబినెట్ విస్తరణ కూడా ఉండచ్చు అన్న ఊహాగానాలు వినిపిస్తున్న ఈ తరుణంలో పార్టీ కి చెందిన ఎమ్మెల్యేలందరితో మీటింగ్ ఏర్పాటు చేయడంతో ..ఎమ్మెల్యేలు కూడా ఈ మీటింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అని సమాచారం. ఈ మీటింగ్ తరువాత కొందరు ఎమ్మెల్యేలకి పార్టీలో ప్రమోషన్ లభించే అవకాశం ఉన్నట్టు తెలియడంతో ఎమ్మెల్యేలు ఈ మీటింగ్ కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.