Begin typing your search above and press return to search.

అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కులు అందించనున్న జగన్

By:  Tupaki Desk   |   4 Nov 2019 3:19 PM GMT
అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కులు అందించనున్న జగన్
X
అగ్రిగోల్డ్‌ బాధితులకు నష్టపరిహారాన్ని చెల్లించేందుకు ఎపి ప్రభుత్వం సిద్ధమైంది. బాధితులకు చెక్కుల పంపిణీ చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ నెల 7 న గుంటూరులో పర్యటించనున్న సిఎం జగన్మోహన్‌ రెడ్డి స్వయంగా అగ్రిగోల్డ్‌ బాధితులకు చెక్కులను పంపిణీ చేయనున్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లించేందుకుగాను ప్రభుత్వం ఇప్పటికే రూ.11,500 కోట్లను విడుదల చేసింది.

తాను సీఎం కాగానే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామన్న జగన్ తొలి విడతగా పదివేల రూపాయల కంటే తక్కువగా వున్న బాధితులకు డబ్బులు వెనక్కు ఇప్పించారు. రెండో విడతలో 20 వేల రూపాయల కంటే తక్కువ వున్న వారికి డబ్బులు పంపిణీ చేయించారు. మూడో విడతలో ఈ నెల 7న గుంటూరులో భారీ బహిరంగ సభ నిర్వహించి తానే స్వయంగా అగ్రి గోల్డ్ బాధితులకు చెక్కులు పంపిణీ చేయాలని నిర్ణయించారు జగన్.

ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు గుంటూరు జిల్లాకు చెందిన మంత్రులు సుచరిత, మోపిదేవి వెంకట రమణతో పాటు గృహ నిర్మాణ మంత్రి రంగనాథ్ రాజులు చూసుకోవాలని జగన్ అప్పగించారు. ముఖ్యమంత్రి ఆదేశాలను అందుకున్న ముగ్గురు మంత్రులు సోమవారం గుంటూరులో జిల్లా ఎమ్మెల్యేలు, ముఖ్యమైన వైసీపీ నేతలతో సమావేశం నిర్వహించారు. బహిరంగ సభ కోసం చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు. సభకు జనసమీకరణ, బాధితుల రాకపోకలకు ఏర్పాట్లు వంటి వాటిపై చర్చలు జరిపారు. ఇంతకుముందు ప్రభుత్వం రూ.263.99 కోట్లు విడుదల చేసి రూ.10 వేల లోపు డిపాజిట్‌ చేసిన దాదాపు 3.70 లక్షల మందికి చెల్లింపులు చేశారు.