Begin typing your search above and press return to search.

విశాఖ‌కు జ‌గ‌న్‌.. స్వామి ఆశీస్సుల కోస‌మేనా?

By:  Tupaki Desk   |   3 Jun 2019 8:41 AM GMT
విశాఖ‌కు జ‌గ‌న్‌.. స్వామి ఆశీస్సుల కోస‌మేనా?
X
రేపు (మంగ‌ళ‌వారం) ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విశాఖ‌ప‌ట్నంకు వెళుతున్నారు. ఉన్న‌ట్లుండి జ‌గ‌న్ విశాఖ టూర్ ఫిక్స్ కావ‌టం ఏమిటి? ఎందుకు ఆయ‌న విశాఖ‌కు వెళుతున్నార‌న్న ప్ర‌శ్న ప‌లువురి నోట వినిపిస్తోంది. జ‌గ‌న్ విశాఖ టూర్ శార‌దా పీఠాధిప‌తి స్వ‌రూపానంద స్వామిని ప్ర‌త్యేకంగా కలిసేందుకేన‌ని చెబుతున్నారు.

సీఎం కార్యాల‌యం కూడా జ‌గ‌న్ విశాఖ టూర్ డిటైల్స్ ను అధికారికంగా ఓకే చేశారు. జ‌గ‌న్ సీఎం కావాలంటూ ప్ర‌త్యేక పూజ‌లు చేయ‌టంతో పాటు.. ప్ర‌మాణస్వీకారోత్స‌వానికి ముహుర్తం పెట్టింది కూడా ఆయ‌నే. ఈ నేప‌థ్యంలో త‌న విజ‌యం త‌ర్వాత ఆయ‌న్ను జ‌గ‌న్ క‌ల‌వ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న్ను ఒక‌సారి క‌ల‌వాల‌న్న ఉద్దేశంతో జ‌గ‌న్ విశాఖ‌కు వెళుతున్నారు.

త‌న తాజా ప‌ర్య‌ట‌న‌లో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ముహుర్తం మీద కూడా మాట్లాడే అవ‌కాశం ఉందంటున్నారు. ఏ ముహుర్తంలో మంత్రుల చేత ప్ర‌మాణ‌స్వీకారం చేయించాల‌న్న అంశం పైనా చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఎన్నిక‌ల ముందే జ‌గ‌న్ కు అధికారం ద‌క్కేందుకు సానుకూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డేందుకు ప్ర‌త్యేక యాగాల్ని స్వ‌రూపానంద స్వామి నేతృత్వంలో నిర్వ‌హించారు.

ఎన్నిక‌ల్లో గెలుపు త‌ర్వాత స్వామి ఆశీస్సులు తీసుకోలేదు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న్ను క‌లిసేందుకు.. ప్ర‌త్యేకంగా కృతజ్ఞతలు తెలియ‌జేయ‌టానికి సీఎం జ‌గ‌న్ విశాఖ‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లుగా చెబుతున్నారు.