Begin typing your search above and press return to search.
జగన్ చేతిలో తొమ్మిది నెలలు... విపక్షాలకు కలవరం ..?
By: Tupaki Desk | 8 Jun 2023 7:00 AM GMTఏపీ లో ముందస్తు ఎన్నికలు జరగవు అన్నది ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ముందస్తు అనుకుంటూ తెలుగు దేశం 2023 నుంచే చాలా హాడావుడి పడింది. ఒక వైపు నారా లోకేష్ పాదయాత్ర చేపట్టారు. చంద్రబాబు అయితే అసలు ఈ రోజో రేపో ఎన్నికలు అన్నట్లుగా హైరానా పడిపోతున్నారు. ఈ వేడి కాస్తా జనసేన కు కూడా తగిలింది.
పవన్ కళ్యాణ్ వరస సినిమాల షూటింగుల తో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఆయన కూడా మధ్యలో వాటికి ఫుల్ స్టాప్ పెట్టి వారాహీ రధం తో జనం లోకి రానున్నారు. ఇలా కనుక చూస్తే ఏపీ లో ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్ లో జరుగుతాయని అంతా భావిస్తూనే ముందుకు కదులుతున్నారు.
అయితే ముందస్తు ఎన్నికలు ఉండవు అని ఏపీ మంత్రివర్గ భేటీ కి ఒక రోజు ముందే సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పేశారు. ఈ నెల 7న క్యాబినేట్ మీటింగ్ కాబట్టి భూమి బద్ధలు అవుతుందని, జగన్ సంచలన నిర్ణయాని కి తెర తీస్తారు అని అంతా భావించారు.
కానీ అవన్నీ వట్టి ఊహాగానాలే అని జగన్ తేల్చేశారు. ముందస్తు ఎన్నికలు అన్నవి ఉండవని ఆయన మంత్రుల తో స్పష్టంగా చెప్పారు. సార్వత్రిక ఎన్నికల కు తొమ్మిది నెలల సమయం ఉందని కూడా ఆయన గుర్తు చేస్తూ ఎవరి బాధ్యతల ను వారు సక్రమంగా నిర్వహిస్తే మరోసారి మనమే మళ్ళీ అధికారం లోకి వస్తామని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా జగన్ చెప్పిన మాట లో విపక్షాల సమరాని కి ఇంకా చాలా దూరం ఉన్నట్లుగా కనిపిస్తోంది. అదే టైం లో అధికారం లో ఉన్న ప్రభుత్వానికి తొమ్మిది నెలలు పైగా సమయం చేతి లో ఉన్నట్లు అవుతోంది. నిజానికి అధికార పార్టీకి ఒక్క రోజు టైం ఇస్తే చాలు వండర్స్ క్రియేట్ చేస్తుంది. అలాంటిది తొమ్మిది నెలలు చేతి లో ఉంటే ఏమైనా చేయవచ్చు. జగన్ కూడా అదే ఆలోచన లో ఉన్నారని అంటున్నారు. అందుకే మంత్రుల ను కష్టపడమని ఆయన చెప్పేశారు. మీ పనుల్లో మీరు ఉండండి, నేను చేయాల్సింది చేస్తాను నాకు వదిలేయండి అని ఆయన భరోసా ఇచ్చారు.
ఇదే ఇపుడు విపక్షాల కు కలవర పెట్టే అంశంగా ఉంది. చేతి లో అధికారం ఉంటుంది. విపక్షాలు ఏదైనా హామీ ఇచ్చినా అందిపుచ్చుకుని క్షణాల్లో అమలు చేసే పరిస్థితి అయితే ప్రభుత్వాని కి ఉంటుంది. ముందస్తు అంటూ చంద్రబాబు మినీ మ్యానిఫేస్టో ప్రకటించారు. అందు లో ఉన్నవి పాత హామీ లే కావడం తో వైసీపీ ఆ వైపు చూడడంలేదు. రేపటి రోజున టీడీపీ ఏమైనా కొత్త ఆలోచనల తో హామీలు ఇస్తే వాటికి మెరుగులు దిద్ది తామే ముందుగా అమలు చేయవచ్చు.
అంతే కాదు అమ్మ వొడి లాంటి పధకాల సొమ్ముని పెంచాలని చూస్తోంది. రైతు భరోసా మొత్తాల ను పెంచనుందని అంటున్నారు. అదే విధంగా ఈ విలువైన కాలం లో పెట్టుబడుల ను కార్యరూపం దాల్చేలా చూసి వరస బెట్టి కొన్ని కంపెనీల ను ప్రారంభించడం, ప్రభుత్వ ఉద్యోగాల ను వీలైనన్ని చోట్ల భర్తీ చేయడం కూడా వైసీపీ చేయనుంది అని అంటున్నారు.
ఇక మరో విషయం ఏంటి అంటే పోలవరం తొలి దశ పనుల ను జగన్ వచ్చే ఏడాది మార్చి లోపే ప్రారంభించాల ని కూడా ఒక ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు. అంటే పోలవరం ప్రారంభించడం ద్వారా గోదావరి జిల్లాల ప్రజల అభిమానాన్ని నిండుగా పొందవచ్చు అన్న ఉద్దేశ్యాలు అధికార పార్టీలో ఉన్నాయని అంటున్నారు.
ఇక ముద్రగడ పద్మనాభం లాంటి వారిని పార్టీలో చేర్చుకునే క్రమంలో కాపుల విషయం లో మరిన్ని హామీలు ఇచ్చేందుకు కూడా వైసీపీ చూస్తుంది అని అంటున్నారు. ఏది ఏమైనా తొమ్మిది నెలలు అంటే చిన్న విషయం కాదు, ఇపుడిపుడే గాడి లో పడుతున్న అభివృద్ధిని జనాల కు రంగు రుచి చూపించి ఎన్నికలకు వెళ్ళేందుకు అవకాశం ఉందని కూడా వైసీపీ భావిస్తోంది.
జూన్ 7వ తేదీన జగన్ ముందస్తు ఎన్నికల ప్రకటన ఉంటుందని తెగ ఊదర గొట్టిన టీడీపీ అనుకూల మీడియా మాత్రం ఇపుడు మాత్రం డల్ అయినట్లుగానే ఉంది. మరో వైపు చూస్తే టీడీపీ నేతలు వర్ల రామయ్య లాంటి వారు అయితే ముందస్తుకు వెళ్ళే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదని విమర్శిస్తున్నారు. ఎటూ ఓడిపోతామ ని తెలిసినందువల్లనే అధికారం చివరి రోజు దాకా అనుభవించాలని డిసైడ్ అయ్యారని నిందిస్తున్నారు. ఏది ఏమైనా కూడా వైసీపీ ఇపుడు కావాల్సినంత టైం తో రిలాక్స్ మూడ్ లో ఉంది అని అంటున్నారు.