Begin typing your search above and press return to search.

హైదరాబాద్‌ పేరుతో బాబును టార్గెట్‌ చేసిన జగన్‌

By:  Tupaki Desk   |   20 March 2015 9:58 AM GMT
హైదరాబాద్‌ పేరుతో బాబును టార్గెట్‌ చేసిన జగన్‌
X
లోపాల్లేకుండా ఉండటం కష్టం. అందులోకి రాజకీయ నేతల మాటలకు.. చేతలకు సంబంధం లేకుండా ఉండటం మామూలే. అయితే.. ఇలాంటి విషయాల్లో కాస్తంత తెలివిగా వ్యవహరించి విమర్శలు మీద రాకుండా జాగ్రత్త పడుతుంటారు. మరికొందరు మాత్రం పట్టించుకోనట్లుగా ఉండిపోతారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ రెండో కోవలోకి వస్తుంటారు.

ఇక్కడ బాబు మర్చిపోయే పాయింటేమిటంటే.. తాను తీసుకున్న నిర్ణయాలపై జగన్‌ లాంటి రాజకీయ ప్రత్యర్థి ప్రశ్నించినప్పుడు.. అసలు విననట్లుగా వ్యవహరించటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని.. దాని వల్ల లాభం కంటే నస్టమే ఎక్కువన్న విషయాన్ని మర్చిపోతుంటారు. తాజాగా జగన్‌బాబు చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం.

రైతుల రుణమాఫీ అంశం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎంతగా కలిసి వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సార్వత్రిక ఎన్నికల్లో ఆయన గెలుపునకు రుణమాఫీ ఎంతో సాయం చేసింది.

వ్యక్తిగతంగా చంద్రబాబుకు రుణమాఫీ చేయాలని ఉన్నా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆయన అలా చేయలేని పరిస్థితి. దీంతో.. అనరుÛల్ని గుర్తించేందుకు రేషన్‌కార్డు.. ఆధార్‌కార్డు ఒకే చోట ఉండాలి లాంటి నిబంధనలు విధించారు.

ఎన్నికల ముందు రుణమాఫీ హామీ అమలుకు ఇన్ని రూల్స్‌ ఉంటాయన్న విషయాన్ని చెప్పని బాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా రూల్స్‌ పెట్టటం ప్రజలకు పెద్దగా నచ్చలేదు.ఈ విషయాన్ని గుర్తించి వైఎస్‌ జగన్‌.. సింఫుల్‌గా ఏం బాబు.. నీకు మాత్రం హైదరాబాద్‌ లో ఆధార్‌ కార్డు ఉండి ఏపీకి ముఖ్యమంత్రి కావొచ్చు కానీ.. హైదరాబాద్‌లో ఆధార్‌ ఉన్న రైతుకు మాత్రం రుణమాఫీ ఇవ్వవా అంటూ ప్రశ్నించారు.

జగన్‌ వేసిన ప్రశ్నలో లాజిక్‌ ఉండటంతో జనాలకు చాలాబాగా నచ్చేసింది. తాను వేసిన ప్రశ్న బాగా పేలటంతో దాన్నో ఆస్త్రంగా మార్చుకున్న జగన్‌.. అప్పుడప్పుడు బాబును ఇరుకున పెట్టేందుకు ఈ డైలాగ్‌ ని సంధిస్తుంటారు. తాజాగా అసెంబ్లీ నుంచి అలిగి వచ్చేసి వెళ్లకుండా ఉన్న ఆయన.. ఇప్పుడీ విషయాన్ని ప్రస్తావించి.. బాబును ఇరుకున పెట్టే ప్రయత్నం మొదలుపెట్టారు. రుణమాఫీ ఎవరు అడగకుండానే.. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చేసిన బాబు.. ఇప్పుడు ఇన్ని రూల్స్‌ ఎందుకు పెడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. మొత్తానికి బాగా పేలిన డైలాగ్‌ ను వీలైనన్నిసార్లు ఉపయోగించి పొలిటికల్‌ మైలేజీ పొందే ప్రయత్నంలో జగన్‌ ఉన్నట్లు చెబుతున్నారు.