Begin typing your search above and press return to search.

వైద్యాన్ని ప్రక్షాళన చేస్తున్న జగన్..

By:  Tupaki Desk   |   28 Jun 2020 9:11 AM GMT
వైద్యాన్ని ప్రక్షాళన చేస్తున్న జగన్..
X
ఏపీ ప్రజలకు జగన్ రక్షగా నిలుస్తున్నారు. ఈ మేరకు ప్రజల ప్రాణాలకు మరింత విలువను ఇచ్చేందుకు ప్రక్షాళన మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే అంబులెన్స్ వ్యవస్థను ప్రక్షాళన చేయబోతున్నారు. ఆధునిక వైద్య పరికరాలతో జనం ముందుకు జగన్ అంబులెన్స్ లు వస్తున్నాయి.

జూలై 1న కొత్త అంబులెన్స్ వాహనాలను సీఎం జగన్ ప్రారంభిస్తున్నారు. ఇందులో అత్యాధునిక వసతులను కల్పిస్తున్నారు. ఏపీ ప్రజల ప్రాణాలకు అండగా నిలవబోతున్నారు. అంబులెన్స్ లో వెంటిలేటర్, ఇన్ ప్యూజన్ పంప్స్, సిరంజి పంప్స్ అమర్చబోతున్నారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో పాటు రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా చిన్నారుల కోసం కొత్తగా 26 నియోనేటల్ అంబులెన్స్ లను ఏర్పాటు చేస్తూ జగన్ నిర్ణయించారు. ఆపదలో ఉండే చిన్నారులను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

లక్షలాది ఏపీ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు సీఎం జగన్ 108, 104 అంసెబలెన్స్ వ్యవస్థను మళ్లీ బితికించేందుకు రెడీ అయ్యారు. వైఎస్ఆర్ హయాంతో తర్వాత ఈ వ్యవస్థ నీరుగారిపోయింది. దీంతో జగన్ మళ్లీ తన తండ్రి కలల ప్రాజెక్టులు అంబులెన్స్ సేవలకు ప్రాణం పోస్తున్నారు. కొత్త అత్యాధునిక అన్ని వసతులు గల వాహనాల కొనుగోళ్లకు రూ.203.47 కోట్ల పైచిలుకు వ్యయం చేస్తున్నారు. ఇలా అంబులెన్స్ వ్యవస్థను మళ్లీ బతికించాలన్న ఉద్దేశంతో జగన్ సర్కార్ నడుం బిగించింది.