Begin typing your search above and press return to search.

ఏపీలో మరో డాక్టర్ వ్యవహారంపై జగన్ సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   8 Jun 2020 3:30 PM GMT
ఏపీలో మరో డాక్టర్ వ్యవహారంపై జగన్ సంచలన నిర్ణయం
X
విశాఖకు చెందిన డాక్టర్ సుధాకర్ ఘటన మరిచిపోకముందే డాక్టర్ అనితారాణి వ్యవహారం ఏపీలో దుమారం రేపుతోంది. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి నియోజకవర్గం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో పెనుమూరు ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న మరో డాక్టర్ అనితారాణి వ్యవహారం వివాదాస్పదమైంది.ఈ డాక్టర్ పై వైసీపీ నేతల వేధింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. టీడీపీ నేతలతో కలిసి హైకోర్టుకు ఎక్కారు.

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులోని పెనుమూరు ప్రభుత్వం ఆసుపత్రిలో డిసెంబర్ లో అనితారాణి అనే డాక్టర్ విధుల్లో చేరారు. రెండు నెలల క్రితం కింది స్థాయి ఉద్యోగుల అవినీతిని ఆమె ప్రశ్నించారు.దీంతో కొందరు వైసీపీ నేతలు, పోలీసులు ఆమెను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. వేధింపులకు పాల్పడ్డారని టీడీపీ నేతలకు ఆమె ఫిర్యాదు చేసి ఆరోపించింది.

ఈ వ్యవహారంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కొందరు నేతలు ఆమె బంధించి అభ్యంతరకరంగా ప్రవర్తించారని.. ఆస్పత్రి బాత్రూంలో ఉన్నప్పుడు ఫొటోలు తీశారని.. ఆమె టీడీపీ నేతలకు విన్నవించి వాపోయారు. పోలీసులూ పట్టించుకోలేదని.. ఉన్నతాధికారులతో ఫోన్లు చేయించి ఒత్తిడి చేశారని ఆమె ఆరోపించింది.

చిత్తూరు జిల్లా నేతలు, పోలీసుల తీరుతో తనకు న్యాయం జరిగే అవకాశం లేదని భావించిన డాక్టర్ అనితారాణి వారం రోజుల క్రితం హైకోర్టును ఆశ్రయించింది. డాక్టర్ సుధాకర్ లాగా తనకు న్యాయం చేయాలని ఆమె హైకోర్టును కోరారు. ఇప్పటికే సుధాకర్ కేసులో ఇబ్బందులు ఎదుర్కొన్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు టీడీపీ నేతల ప్రోద్బలంతో హైకోర్టు మెట్లు ఎక్కిన డాక్టర్ అనితారాణి వ్యవహారంలో కఠినంగా ముందుకెళ్లాలని జగన్ సర్కార్ నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో తమ పార్టీ వారా? లేక దీని వెనుక టీడీపీ నేతల కుట్ర దాగుందా? ఎవ్వరైనా వదిలిపెట్టేది లేదని సీఎం జగన్ ఆగ్రహించారు. ఈ మేరకు ఈ వ్యవహారంపై సీఎం జగన్ తాజాగా సీఐడీ దర్యాప్తునకు ఆదేశించారు. దీంతో డాక్టర్ అనితారాణి వ్యవహారం మలుపుతిరిగింది.