Begin typing your search above and press return to search.

కేంద్రంలో ఆ అవకాశాన్ని అడ్వాంటేజ్ గా మార్చుకోనున్న జగన్!

By:  Tupaki Desk   |   10 May 2019 7:35 AM GMT
కేంద్రంలో ఆ అవకాశాన్ని అడ్వాంటేజ్ గా మార్చుకోనున్న జగన్!
X
అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్ కు సమదూరం లో నిలబడటం ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి అనుకూలాంశంగా మారుతోంది. కేంద్రంలో ఎవరూ స్పష్టమైన మెజారిటీని తెచ్చుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి నేఫథ్యంలో జగన్ కూడా ఎక్కడా బయట పడటం లేదు. కేంద్రంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఎవరికి? అనే అంశాన్ని అలా మిస్టరీ గానే ఉంచారు జగన్ మోహన్ రెడ్డి.

ఫలితంగా జగన్ తాపీగా ఎన్నికల ఫలితాలు వెల్లడి అయిన తర్వాత స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫలితాలు వచ్చే తీరును బట్టి.. కేంద్రంలో ఎవరికి సపోర్ట్ చేయాలనే అంశం మీద నిర్ణయం తీసుకోవడానికి జగన్ కు పూర్తి స్వతంత్రం ఉంటుందిప్పడు!

ఎన్డీయేకి వ్యతిరేకి కాదు - యూపీఏకి అనుకూలుడు కాదు.. ఇదీ ఇప్పుడు జగన్ ఇమేజ్. మరోవైపు జాతీయ స్థాయిలో ఎన్నికల ఫలితాలు కూడా వన్ సైడెడ్ గా ఉండవు అని స్పష్టం అవుతోంది. బీజేపీకి గత ఎన్నికల్లో వచ్చినంత స్థాయిలో సీట్లు రావు. అలాగని చిత్తు అయిపోదు.

ఎన్డీయే రూపంలో బీజేపీ మినిమం మెజారిటీకి దగ్గర దగ్గర గా రావొచ్చు అనే అంచనాలు ఉన్నాయి. ఒకవేళ అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే.. అప్పుడు మరి కొన్ని ప్రాంతీయ పార్టీలను బీజేపీ కలుపుకుని పోవాల్సిందే!

కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా దాదాపు అదే! సొంతం గా అధికారంలోకి కల్ల. ప్రాంతీయ పార్టీలన్నింటినీ కలుపుకుంటే.. అది అధికారానికి దగ్గరగా వెళ్లగలదు. అలాంటి సందర్భంలో వైఎస్ జగన్ వంటి వారి మద్దతు అత్యంత కీలకం అయ్యే అవకాశం ఉంది.

ఏపీలో జగన్ పదిహేనుకు పైన ఇరవై సీట్ల స్థాయిలో ఎంపీలను గెలుచుకుంటే.. కేంద్రంలో కీ ప్లేయర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రాజకీయ పరిస్థితి అలా ఉంది. తటస్థంగా నిలబడినందుకు జగన్ కు మంచి అవకాశాలు లభించేలా ఉన్నాయి.

ఈ సందర్భంలో కేంద్రంలో మద్దతు విషయంలో జగన్ ఒకే అంశాన్ని ఫాలో అయ్యే అవకాశం ఉంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఖాయంగా ఇచ్చే వారికి - దాన్ని అనౌన్స్ చేసే వారికే జగన్ మద్దతును ఇవ్వబోతున్నారని స్పష్టం అవుతోంది. కేంద్రంలో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ దక్కని పరిస్థితి తలెత్తేలా ఉన్న నేపథ్యంలో.. జగన్ తనకు దక్కే ఎంపీ సీట్ల ద్వారా ముందుగా తన రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సంపాదించి.. తన సమర్థతను - చాతుర్యాన్ని చాటుకోవచ్చు.