Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారం ముహుర్తం ఫిక్స్!

By:  Tupaki Desk   |   25 May 2019 11:33 AM GMT
జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారం ముహుర్తం ఫిక్స్!
X
స్ట‌న్నింగ్ విజ‌యాన్నిసొంతం చేసుకున్న వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏపీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసేది ఈ నెల 30న అన్న విష‌యం తెలిసిందే. మ‌రి.. ఆయ‌న ప్ర‌మాణ‌స్వీకారం ఏ టైంలో.. ఎక్క‌డ చేస్తార‌న్న దానిపై క్లారిటీ లేదు. తాజాగా దీనికి సంబంధించిన స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఏపీ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకార మ‌హోత్స‌వాన్ని 30న ఉద‌యం 11.40 నిమిషాల‌కు ముహుర్తంగా ఫిక్స్ చేశారు. విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంను వేదిక‌గా ఏర‌ప్ఆటుచేశారు. రాష్ట్రగ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ జ‌గ‌న్ చేత ఏపీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేయిస్తారు.

జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకార మ‌హోత్స‌వాన్ని భారీగా నిర్వ‌హించేలా ఏర్పాట్లుచేస్తున్నారు. ఆయ‌న ప్ర‌మాణ స్వీకార‌మ‌హోత్స‌వాన్ని తిల‌కించేందుకు ల‌క్ష‌లాదిగా ప్ర‌జ‌లు విచ్చేసే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. అదే స‌మ‌యంలో పెద్ద ఎత్తున ప్ర‌ముఖులు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ఇప్ప‌టివ‌ర‌కూ అందుతున్న స‌మాచారం ప్ర‌కారం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నున్నారు. ఆయ‌న‌తో పాటు ప‌లువురు తెలంగాణ నేత‌ల‌తో పాటు.. మ‌రికొంద‌రు ప్ర‌ముఖులు వ‌స్తార‌ని అంచ‌నా వేస్తున్నారు. సీఎంగా జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకార మ‌హోత్స‌వం నేప‌థ్యంలో విజ‌య‌వాడ న‌గ‌రంలో ట్రాఫిక్ ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూడాల‌ని అధికారుల‌ను రాష్ట్ర సీఎస్ ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం ఆదేశాలు జారీ చేశారు.

తాజాగా ఆయ‌న ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మ ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తూ.. ఒక స‌మీక్ష‌ను నిర్వ‌హించారు. ఈ సమీక్షకు డీజీపీ ఠాకూర్, విజయవాడ సీపీ, సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌, మునిసిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల వలవన్, ప్రొటోకల్ డైరెక్టర్ అశోక్‌బాబు, విజయవాడ మునిసిపల్ కమిషనర్‌ రామారావు పాల్గొన్నారు.కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.