Begin typing your search above and press return to search.

షాకింగ్ గా జ‌గ‌న్ ప్ర‌మాణస్వీకారోత్స‌వ బిల్లు!

By:  Tupaki Desk   |   31 May 2019 6:53 AM GMT
షాకింగ్ గా జ‌గ‌న్ ప్ర‌మాణస్వీకారోత్స‌వ బిల్లు!
X
గ‌వ‌ర్న‌ర్..ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి.. మ‌రో రాష్ట్ర విప‌క్ష నేత‌.. ప‌లువురు అతిధులు.. వారికి ప్ర‌యాణ ఖ‌ర్చులు.. అతిధి మ‌ర్యాద‌ల‌తో పాటు భోజ‌నాలు.. ఇవ‌న్నీ కాక‌.. భారీ ఎత్తున ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మం. ఇదంతా చేయ‌టానికి ఎంత ఖ‌ర్చు అవుతుంది? అంటే.. కోట్ల‌ల్లో లెక్క‌లు చెప్ప‌టం ఖాయం. అయితే.. అలాంటివ‌న్నీ తెలుగుదేశం ప్ర‌భుత్వంతోనే పోయాయా? అంటే అవున‌ని చెప్పాలి. ఖ‌ర్చు విష‌యంలో మొద‌ట్నించి జాగ్ర‌త్త‌గా ఉంటూ.. అన‌వ‌స‌రంగా ఖ‌ర్చు చేయొద్ద‌న్న మాట‌ను అదే ప‌నిగా చెప్పిన జ‌గ‌న్ మాట‌ల ప్ర‌భావం క‌నిపించింది.

ఏపీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మానికి అయిన ఖ‌ర్చు లెక్క తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ ఖ‌ర్చు లెక్క విన్న వారంతా అవాక్కు అవుతున్నారు. ఇంత త‌క్కువ ఖ‌ర్చుతో అంత పెద్ద కార్య‌క్ర‌మ‌న్ని పూర్తి చేశారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. చిన్న‌పాటి కార్య‌క్ర‌మానికి కోట్లు ఖ‌ర్చు చేసే చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి.. జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి మ‌ధ్య వ్య‌త్యాసం ఆరంభంలోనే అర్థ‌మైపోయింద‌ని చెప్పాలి.

గురువారం బెజ‌వాడ‌లో నిర్వ‌హించిన ఏపీ ముఖ్య‌మంత్రి ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మానికి అయిన ఖ‌ర్చు రూ.50ల‌క్ష‌ల కంటే త‌క్కువ కావ‌టం విశేషం. ఖ‌ర్చు విష‌యంలో మొద‌ట్నించి ఆచితూచి అన్న‌ట్లుగా ఉన్న జ‌గ‌న్ మాట‌ల‌కు త‌గ్గ‌ట్లే.. అధికారులు ఆచితూచి అన్న‌ట్లు ఖ‌ర్చు చేశారు. అలా అని ఏర్పాట్ల విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదు.

పైసా ప‌క్క‌దారి ప‌ట్ట‌కుండా చేసిన దానికి త‌గ్గ‌ట్లే తాజా ఖ‌ర్చు లెక్క ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మానికి ఏపీ ప్ర‌భుత్వం రూ.29ల‌క్ష‌ల మొత్తాన్ని అడ్వాన్స్ రూపంలో విడుద‌ల చేసింది. కార్య‌క్ర‌మం పూర్తి అయ్యాక మొత్తం ఖ‌ర్చు లెక్క‌ను చూస్తే.. రూ.48.5ల‌క్ష‌ల మొత్తంగా తేల్చారు. గ‌తంలో ఇలాంటి కార్య‌క్ర‌మాల కోసం కోట్లాది రూపాయిలు ఖ‌ర్చు చేసేవారు. ఇందుకు భిన్నంగా జ‌గ‌న్ మాత్రం త‌న ప్ర‌మాణ స్వీకారోత్స‌వం రోజునే త‌న మార్క్ ను చూపించార‌ని చెప్పాలి. ప్ర‌జాధ‌నం విష‌యంలో తానెంత క‌రెక్ట్ గా ఉన్నాన‌న్న విష‌యాన్ని త‌న తాజా ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వ ఖ‌ర్చు లెక్క‌తో చూపించార‌ని చెప్పాలి.