Begin typing your search above and press return to search.
మోడీకి జై కొడతా అంటున్న జగన్*
By: Tupaki Desk | 8 Nov 2017 7:33 AM GMT‘‘మోడీకి జై కొడతా అంటున్న జగన్’’ అనే టైటిల్ పెట్టాల్సి వస్తే.. దానికి ఒక ట్యాగ్ లైన్ కూడా తగిలించాలి. ‘కండిషన్స్ అప్లయ్’ అని చెప్పాలి. ఎందుకంటే.. కొన్ని డిమాండ్లకు ఆమోదించేట్లయితే.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అంటున్నారు. ఇప్పటికే కేంద్రంలోని మోడీ సర్కారుకు జగన్ అంశాల వారీగా మద్దతు ఇస్తున్నారు. మోడీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో.. భాజపా అగ్రనేతల నుంచి జగన్ కు కూడా ఫోన్లు వస్తున్నాయి. ముందస్తు సమాచారం అందుతున్నది. సహకారం కోరడం జరుగుతున్నది. ఆ రకంగా కేంద్రం వద్ద జగన్ కు తగుమాత్రం ప్రాధాన్యం దక్కుతూనే ఉంది. అయితే ఆయన ఏకంగా వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి మద్దతిచ్చి జైకొడతా అనే స్థాయిలో మాట ఇవ్వడంలో అసలు మతలబు దాగి ఉంది.
ఇంతకూ ఆ ట్యాగ్ లైన్ మరియు అప్లయ్ అయ్యే కండిషన్స్ ఏంటంటే.. కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలి. ఆ హామీని వారు ఇస్తే గనుక.. వచ్చే ఎన్నికల్లో వారికి మద్దతు ఇవ్వడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. అంటే ఆయన కమలదళంతో ఇప్పటికే ఉన్న స్నేహాన్ని మరింత బంధంగా మార్చుకోబోతున్నారన్నమాట. తన పాదయాత్ర సందర్భంగా ఒక ఇంగ్లిషు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ ఈ మాట చెప్పారు.
ఇదంతా ఒక ఎత్తు. అయితే జగన్ మాటలను గమనించినప్పుడు.. ఆయన కూడా మోడీ పన్నిన ఉచ్చులో తగులుకుంటున్నారేమో.. ఆ మాయలో పడిపోతున్నారేమో అని అనిపిస్తోంది. ఎందుకంటే.. హోదా గురించి హామీ ఇస్తే మద్దతిస్తా అని ఆయన అంటున్నారు. అలాకాకుండా.. ఇప్పుడు ప్రభుత్వంలో ఏలుబడి సాగిస్తున్నది భాజపానే గనుక.. ఈ ప్రభుత్వం పదవీ కాలం ముగిసేలోగా హోదా ఇస్తే మాత్రమే తాము మళ్లీ మద్దతు అందిస్తాం అని ఆయన చెప్పగలగాలి. అలాంటి హెచ్చరిక మాత్రమే కేంద్రంలో కదలిక తీసుకురాగలుగుతుంది.
హామీ ఇవ్వాలని అడిగితే మోడీ పుష్కలంగా ఇస్తారు. గెలిచిన తర్వాత మరచిపోతారు. ఇప్పుడు జరిగింది కూడా అదే. ఏరు దాటే దాకా ఓడ మల్లన్న - ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అనే సామెత ఆచరణ రూపంలో మోడీకి తెలిసినంత బాగా మరెవ్వరికీ తెలియకపోవచ్చు. మోడీతో పని చక్కబెట్టుకోవాలంటే.. నిజంగానే రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలనే కోరిక జగన్మోహన్ రెడ్డికి ఉన్నట్లయితే.. హామీ కాదు.. హోదా ఇస్తే మాత్రం.. మోడీకి మద్దతు ఇస్తాం అనిచెప్పాలి. ఆ దిశగా ఆయన ఆలోచిస్తారేమో చూద్దాం.