Begin typing your search above and press return to search.

పవన్...! చంద్రబాబుతో జాగ్రత్త: జగన్ సూచన

By:  Tupaki Desk   |   6 Dec 2017 5:30 PM GMT
పవన్...! చంద్రబాబుతో జాగ్రత్త: జగన్ సూచన
X
పాలకుడు అవినీతి పరుడు అయితే ప్రజలపై ప్రభావం ఉంటుందని అందుకే వైసీపీ అధ్యక్షుడు జగన్‌ కు గత ఎన్నికల్లో జగన్‌ కు మద్దతు ఇవ్వలేదని చెప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కు జగన్ భారీ కౌంటరేశారు. పవన్‌ కళ్యాణ్‌ తో తనకు పరిచయం లేదని జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. అంతేకాదు... పవన్ విమర్శలకు ధీటుగా బదులిచ్చారు. చంద్రబాబుకు అవసరమైనప్పుడే పవన్ ఎంటరౌతారని, చంద్రబాబును పవన్ విమర్శించరని జగన్ ఆరోపించారు. ప్రత్యేక హోదాపై తనది - పవన్‌ ది ఒకే మాట అయినా పవన్ కళ్యాణ్ ఇంకా చంద్రబాబు ప్రభావంలోనే ఉన్నారని, చంద్రబాబు ప్రభావం నుంచి పవన్ బయటకు రావాలన్నారు.

పాదయాత్ర మధ్యలో విరామ సమయంలో ఓ టీవీ ఛానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్.. పవన్‌ విషయం మాట్లాడారు. చంద్రబాబు కోసం పవన్ పనిచేస్తున్నారని అన్నారు. చంద్రబాబు మోసం - అన్యాయం చేస్తారనే విషయాన్ని పవన్ తెలుసుకుంటే మంచిదన్నారు.

కాగా అంతకుముందు పవన్ ఈ రోజు తన ప్రసంగంలో జగన్ పై విమర్శలు చేశారు. జగన్ లాంటి వ్యక్తిని సమర్థిస్తే తాను కూడా అలా అవుతానేమోనని భయం వేసిందని.. అందుకే ఆయనకు మద్దతివ్వలేదని అన్నారు. తండ్రి సీఎం అయితే తాను కూడా ముఖ్యమంత్రి కావాలని అనుకోవడం అవివేకమని - ఇది ప్రజాస్వామ్యమా?.. రాచరికమా? అని కూడా ప్రశ్నించారు. పాదయాత్ర చేస్తే సీఎం అవుతారా..? అని కూడా పవన్‌ ప్రశ్నించారు.

పవన్ తనపై సూటిగా వ్యాఖ్యలు చేయడంతో జగన్ కూడా అంతేస్థాయిలో రెస్పాండ్ అయ్యారు. చంద్రబాబు కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలన్నట్లుగా చురకలేశారు.