Begin typing your search above and press return to search.
అర్జంటుగా మళ్ళీ ఢిల్లీకి... మ్యాటర్ సీరియస్సేనా...?
By: Tupaki Desk | 3 Sep 2022 1:47 PM GMTఏపీ సీఎం జగన్ ఈ మధ్యన ఢిల్లీ టూర్లు ఎక్కువగానే చేస్తున్నారు. నిజానికి ఆయన సీఎం అయిన తరువాత హస్తిన పర్యటనలు చాలానే పెట్టుకున్నారు. ఒక విధంగా చూస్తే జగన్ అయిదేళ్ళ పాలన ముగిసే సమయానికి చంద్రబాబు కంటే కూడా ఎక్కువ సార్లు ఢిల్లీ టూర్లు చేసిన ఘనతను సాధిస్తారేమో. ఇదంతా ఎందుకంటే జగన్ మరోసారి ఢిల్లీ టూర్ కి రెడీ అవుతున్నారు అని ఒక వైపు ప్రచారం సాగుతోంది.
జగన్ కడప జిల్లాలో మూడు రోజుల పర్యటన ముగించుకుని తాడేపల్లి ఇంట్లో ఇలా అడుగుపెట్టారో లేదో అలా ఆయన ఢిల్లీ ఫ్లైట్ ఎక్కబోతున్నారు అని టాక్. జరుగుతున్న ఈ ప్రచారం నిజమైతే మాత్రం ఈ నెల 5న జగన్ ఢిల్లీలో ఉంటారు అని అంటున్నారు. మరి ఇంత అర్జంటుగా జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు. ఆ అవసరం ఏమిటి అంటే మ్యాటర్ చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారు.
జగన్ ఈ నెల 7న మూడు రాజధానుల మీద అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడానికి డిసైడ్ అయ్యారు. దానికి రెండు రోజుల ముందు ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. నేరుగా ప్రధాని నరేంద్ర మోడీని ఆయన కలుస్తారు అని అంటున్నారు. మూడు రాజధానులకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా చూడాలని ఆయన కేంద్రాన్ని కోరుతారు అని తెలుస్తోంది.
అదే విధంగా ఈ మధ్యనే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ఒక ప్రైవేట్ బిల్లుని ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ను సవరించాలని ప్రతిపాదిస్తున్నారు. ఆర్టికల్ 3ఏను చేర్చి సవరణ చేయాలని కోరుతున్నారు. అలా కనుక చేస్తే రాజధానుల అంశం పూర్తిగా రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది. అపుడు ఏ రాష్టం అయినా తనకు ఎన్ని రాజధానులు అయినా ఏర్పాటు చేసుకోవచ్చు. అంతే కాదు ఉన్న రాజధానులను వేరే చోట్లకు కూడా ఈజీగా మార్చుకోవచ్చు.
దీని మీద న్యాయస్థానాలలో ఎలాంటి వ్యాజ్యాలు కానీ అడ్డంకులు కానీ ఉండవు. దాంతో జగన్ ప్రైవేట్ బిల్లుని తన పార్టీ చేత రాజ్యసభలో పెట్టించారు అని అంటున్నారు. ఈ బిల్లుని ఆమోదించేలా చూడాలని ఆయన కేంద్రాన్ని కోరుతారు అని అంటున్నారు. ఇప్పటికే రాజధానులు అన్నవి రాష్ట్రాల పరిధిలోని అంశమే అని కేంద్రం ఆ మధ్య హై కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ లో స్పష్టం చేసింది.
ఇపుడు దానికి మరింతగా వెసులుబాటు కలిగిస్తూ రాజ్యాంగ సవరణ కనుక చేస్తే మూడు రాజధానులు తాము అనుకున్నట్లుగా ఏర్పాటు అవుతాయని జగన్ భావిస్తున్నారు అని అంటున్నారు. జేడీయూ ఎన్డీయే నుంచి వెళ్ళిపోవడంతో ఇపుడు వైసీపీకి చెందిన తొమ్మిది సభ్యుల మద్దతు బీజేపీకి అవసరం పడుతోంది. దాంతో పాటు మూడు రాజధానుల విషయంలో గట్టిగా పట్టుబట్టి ఈ టైమ్ లోనే కేంద్రం నుంచి సానుకూలత సాధించుకోవాలని వైసీపీ చూస్తోంది అని అంటున్నారు. అందుకే అర్జంటుగా జగన్ ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు అని ప్రచారం అయితే సాగుతోంది.
ఢిల్లీలో కనుక ఓకే అనిపించుకుంటే ఇక ఎలాంటి సంకోచం లేకుండా అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లుని ఈ వర్షకాల మీట్ లోనే ప్రవేశపెడతారు అని అంటున్నారు. ఎన్నికలకు వెళ్ళే లోపే మూడు రాజధానులను ఏపీలో ఏర్పాటు చేసి తీరుతామని మంత్రి గుడివాడ అమరనాధ్ ఇప్పటికే ప్రకటించిన నేపధ్యంలో జగన్ ఢిల్లీ టూర్ వార్తలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.