Begin typing your search above and press return to search.
తిరుపతి సీటు దక్కించుకునేందుకు జగన్ కొత్త స్కెచ్..
By: Tupaki Desk | 13 Feb 2021 5:30 AM GMTఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి కొత్త తలనొప్పులు తయారవుతున్నాయి. ముఖ్యంగా తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో ఫ్యాన్ పార్టీకి క్లారిటీ రావడం లేదు. ఇప్పటి వరకు పార్టీ తరుపున పోటీ చేసేందుకు అనధికారికంగా ఓ అభ్యర్థిని ప్రకటించారు జగన్. ఈ అభ్యర్థికి జగన్ కు చాలా దగ్గర సంబంధాలున్నాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఈయనను మార్చేందుకు సీఎం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆయన స్థానంలో మరో నేతను నిలబెట్టే అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది. దగ్గరి సంబంధాల కంటే ఆ విషయంలో గట్టి నిర్ణయం తీసుకోక తప్పదని తెలుస్తోంది. అయితే ఈ మార్పు ఎందుకోసం..? ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థి జగన్ కు అనుయాయుడే అయినా ఆయనను మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది..?
మార్చిలో తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక జరిగే అవకాశం ఉంది. అంటే ఈ నెలలోనే ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం టీడీపీ ఇప్పటికే పనబాక లక్ష్మి పేరును ఖరారు చేసింది. అటు బీజేపీ, జనసేనలు ఇంకా ఏ పార్టీనుంచి అభ్యర్థి పోటీ చేస్తాడనే విషయంపై చర్చలు జరుపుతున్నారు. అధికార వైసీపీ గురుమూర్తి అనే వ్యక్తిని ఎంపీ అభ్యర్థిగా జగన్ ప్రతిపాదించారు. ఇక ఆయనే పార్లమెంట్ అభ్యర్థి అనుకున్నారు. కానీ ఈ అభ్యర్థిని జగన్ అధికారికంగా ప్రకటించలేదు.
తిరుపతిలో పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ గెలవాలంటే కష్టంతో పాటు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. మరోవైపు ప్రభుత్వం నుంచి ఏ చిన్న తప్పిదం దొరికినా దానిని ఆధారంగా చేసుకొని ప్రజల్లోకి వెళుతున్నాయి ప్రతిపక్ష పార్టీలు. హిందువాదం పేరుతో బీజేపీ, జనసేనలు..ప్రభుత్వం చేస్తున్న కొన్ని తప్పిదాలతో టీడీపీ ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇక్కడ వైసీపి గెలుపుకు తీవ్ర పోటీ ఏర్పడింది.
ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల పోటీని తట్టుకోవడానికి ఖర్చుకు వెనుకాడని పరిస్థితి ఎదురైంది. అయితే జగన్ అనుకుంటున్న తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తి పెద్ద క్యాష్ పార్టీ కాదు. ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు ఆయన దగ్గర డబ్బులు లేవు. అయితే పార్లమెంట్ పరిధిలో ఉన్న కొందరు వైసీపీ నేతలు కోట్లకు ఉన్నారు. కానీ వారు ఈ స్థానం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డవారు ఈ తరుణంలో గురుమూర్తిని గెలిపించేందుకు డబ్బును పెట్టే అవకాశాలు తక్కవేనంటున్నారు.
అయితే పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల నాయకులతో జగన్ త్వరలో సమావేశం నిర్వహించి గురుమూర్తిని గెలిపించాలని ఆదేశాలు ఇస్తారని కొందరు అంటున్నారు. గురుమూర్తికి అవసరమైన ఖర్చును ఆయా నాయకులకు పంచుతారని చర్చించుకుంటున్నారు. ఎంత లేదన్నా నియోజకవర్గానికి 10 నుంచి 15 కోట్ల వరకు ఖర్చు చేయాలి. అంటే కనీసం 100 కోట్లు ఖర్చు చేయనిదే తిరుపతి పార్లమెంట్లో అభ్యర్థి గెలుపు కష్టం. ఒకవేళ ఎమ్మెల్యేలు ఈ ఖర్చు మోయాలనే ఆదేశాలు ఇవ్వని నేపథ్యంలో అవసరమైతే ఆర్థిక భారాన్ని మోసే అభ్యర్థి ఎవరైనా ముందుకు వస్తే వారికే టికెట్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. మరి జగన్ ఈ రెండింటిలో ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.
ఒకవేళ రెండో నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తే మాత్రం ఆశావహులు భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఉప ఎన్నిక, సాధారణ ఎన్నికల కంటే ఖర్చుతో కూడుకున్నది. అంతేకాకుండా అధికారంలో ఉన్న పార్టీ గెలవకపోతే ప్రభుత్వంపైనే అపనమ్మకం పడే ప్రమాదం ఉంది. అందువల్ల తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక గెలుపుకోసం జగన్ ఏ నిర్ణయానికైనా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.