Begin typing your search above and press return to search.

ప్ర‌తిప‌క్షం ట్రాప్‌లోకి ప్ర‌భుత్వం.. జ‌గ‌న్ వ్యూహం ఇదే..!

By:  Tupaki Desk   |   22 Jan 2022 2:30 PM GMT
ప్ర‌తిప‌క్షం ట్రాప్‌లోకి ప్ర‌భుత్వం.. జ‌గ‌న్ వ్యూహం ఇదే..!
X
ఉద్యోగుల‌కు తాము ఏం చేశాం.. ఉద్యోగులు ఏంచేస్తున్నారు- అనే అంశంపై ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని.. సాక్షా త్తూ.. సీఎంజ‌గ‌న్ పార్టీ నేత‌ల‌కు పిలుపునిచ్చారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ క్రియాశీల నాయ‌కులు అంద‌రూ.. మూకుమ్మ‌డిగా ప్ర‌జ‌ల మధ్య ఉండాల‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌భుత్వం పీఆర్సీ ఇచ్చినా.. ఉద్యోగులు ఉద్య‌మాల‌కు సిద్ధం కావ‌డం.. జ‌గ‌న్‌కు ఇబ్బందిగానే మారింది. ప్ర‌తిప‌క్షాలు ఉద్య‌మం చేస్తే.. రాజ‌కీయంగా ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుంది. కానీ, ఇప్పుడు ఉద్యోగులు.. రోడ్డెక్కారు. వీరిని స‌ముదాయించ‌డమే త‌ప్ప‌.. మ‌రోమార్గం క‌నిపించ‌డం లేద‌ని .. తెలుస్తోంది.

వాస్త‌వానికి ఉద్యోగుల‌తో ప‌నిచేయించుకునే క్ర‌మంలోప్ర‌భుత్వానికి ఉన్న ఆయుధం ఎస్మా. అయితే.. దీనిని ప్ర‌యోగిస్తే.. మ‌రింత తీవ్రత పెరుగుతుంద‌ని.. తాజాగా జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.గ‌తంలో త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత ఎస్మా ప్ర‌యోగించి ఉద్యోగుల‌ను లైన్‌లో పెట్టుకున్నా.. త‌ర్వాత‌.. కాలంలో ఆమె విజ‌యం సాధించ‌లేక పోయారు. ఈ ప‌రిస్థితి ఇప్పుడు ఎదురైతే.. పార్టీ అధికారం కోల్పోవ‌డం ఖాయ‌మ‌ని.. అస‌లు ప్ర‌తిప‌క్షాలు కూడా ఇప్పుడు ఇదే కోరుకుంటున్నాయ‌ని.. జ‌గ‌న్ భావిస్తున్నారు.

ఉద్యోగుల‌ను ప్రోత్స‌హిస్తున్న‌వారి ట్రాప్‌లో స‌ర్కారు చిక్కుకోకుండా.. ఉండేలా ఆయ‌నఅన్ని ర‌కాలుగాను ముందుకు వెళ్లాల‌ని ఆలోచిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికిప్పుడు.. నేత‌ల‌ను రంగంలోకి దింపి.. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు అవ‌స‌ర‌మైన అన్ని చేస్తున్నామ‌ని.. వారు అడ‌గ‌కుండానే.. కొన్ని క‌ల్పించామ‌ని.. అడిగిన వాటిని కూడా హెచ్చార్ ఏ త‌ప్ప‌.. అన్నీ చేస్తున్నామ‌ని.. చెప్పుకోనేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నారు.

అంతేకాదు.. హెచ్చార్ ఏపెంచితే.. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు నిలిచిపోతాయ‌ని.. ఆయ‌న ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డం ద్వారా.. స‌ర్కారు ఉద్యోగుల‌కు మేలు చేస్తోంద‌నే వాద‌న‌ను బ‌లంగా వినిపించే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఎంపీలు.. ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధుల‌ను కూడా రంగంలోకి దింపుతున్నారు. మ‌రి ఇది స‌క్సెస్ అవుతుందా? లేదా? అనేది చూడాలి.