Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ తెలివే తెలివి.. దిమ్మ తిరిగే ప్లాన్ వేశారుగా!

By:  Tupaki Desk   |   30 May 2019 10:19 AM GMT
జ‌గ‌న్ తెలివే తెలివి.. దిమ్మ తిరిగే ప్లాన్ వేశారుగా!
X
అప్పుల్లో కూరుకుపోయిన ఒక రాష్ట్రంలో వంద ఉద్యోగాలు ఇవ్వాలంటే కిందా మీదా ప‌డే ప‌రిస్థితి. ప్ర‌భుత్వ ఉద్యోగ‌స్తుల‌కు జీతాలు ఇవ్వ‌టానికి ఓవ‌ర్ డ్రాఫ్ట్ తీసుకోవాల్సిన దుస్థితి ఉన్న రాష్ట్రంలో.. కేవ‌లం మూడంటే మూడు నెల‌ల్లో 4 లక్ష‌ల ఉద్యోగాలు భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన జ‌గ‌న్ ద‌మ్ముకు.. ధైర్యానికి షాక్ తింటున్నారు. నిజానికి ఆయ‌న చెప్పిన ప‌థ‌కం.. ఉద్యోగుల్ని నియ‌మించుకునే తీరుతో పాటు.. అందుకు ఆయ‌న ప్లానింగ్ చూస్తే.. వావ్ అనాల్సిందే.

ఇవాల్టి రోజున ఒక ప‌థ‌కం అమ‌లు చేయాలంటే వేలాది కోట్లు కావాలి. అందుకు భిన్నంగా స్వ‌ల్ప బ‌డ్జెట్ తో భారీ ప్రొడెక్టిటివిటీతో పాటు.. ప్ర‌భుత్వ ఇమేజ్ ను ఎక్క‌డికో తీసుకెళ్లేలా చేసిన ప్లానింగ్ కు హేట్సాఫ్ చెప్పాలి. త‌న ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం సంద‌ర్భంగా జ‌గ‌న్ రెండు కీల‌క ప్ర‌క‌ట‌న‌లు చేశారు. ఆగ‌స్టు 15 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 4ల‌క్ష‌ల ఉద్యోగాల్ని భ‌ర్తీ చేస్తామ‌ని.. ప్ర‌తి గ్రామంలోనూ గ్రామ‌సేవ‌కుల్ని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు వీరికి నెల‌కు రూ.5వేల చొప్పున జీతం ఇస్తామ‌ని చెప్పారు.

ప్ర‌భుత్వ ప‌థ‌కాల్ని డోర్ డెలివ‌రీ ఇచ్చే క్ర‌మంలో చేప‌ట్టిన ఈ ఉద్యోగ క‌ల్ప‌న‌లో తాము కులం.. మ‌తం.. ప్రాంతం.. రాజ‌కీయం.. ఇలాంటివేమీ చూడ‌కుండా ఎంపిక చేస్తామ‌ని ఆయ‌న చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ల‌క్ష‌ల ఉద్యోగాల్ని భ‌ర్తీ చేస్తామ‌ని చెప్పారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. గ్రామ‌స్థాయిలో ప్ర‌భుత్వ ప‌థ‌కాలు స‌రిగా అమ‌లు అవుతున్నాయా? లేదా? అన్న విష‌యాల్ని చూసేందుకు గ్రామ స‌చివాల‌యాల్ని ఏర్పాటు చేస్తామ‌ని.. ఇందులో ప‌ని చేయ‌టానికి 1.60ల‌క్ష‌ల ఉద్యోగాల్ని క‌ల్పిస్తామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. వీరికి ఎంత జీతం ఇస్తామ‌న్న విష‌యాన్ని జ‌గ‌న్ ప్ర‌క‌టించ‌లేదు. కాకుంటే.. ప్ర‌తి గ్రామంలోనూ గ్రామ స‌చివాల‌యంలో ప‌ని చేయ‌టానికి ఒక్కో గ్రామంలో ప‌ది మందిని నియ‌మిస్తామ‌ని.. వీరికి ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఇస్తామ‌ని ఆయ‌న చెబుతున్నారు.దీనికి అక్టోబ‌రు 2 డెడ్ లైన్ గా పెట్టుకున్నారు.

అంటే.. ఇంచుమించు ఆర్నెల్ల టైమ్ లైన్ లో 5.6 ల‌క్ష‌ల ఉద్యోగాల్ని భ‌ర్తీ చేయ‌టంతో పాటు.. కొత్త సైన్యాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం కింద‌కు తీసుకురానున్న‌ట్లుగా చెప్పాలి.మ‌రి.. దీనికి అయ్యే ఖ‌ర్చు ఎంతో తెలుసా? రూ.350 కోట్లు మాత్ర‌మే. రూ.5వేల చొప్పున 4ల‌క్ష‌ల ఉద్యోగాల‌కు రూ.300కోట్లు ఖ‌ర్చు అయితే.. 1.60ల‌క్ష‌ల ఉద్యోగాల‌కు ప్ర‌తి ఒక్క‌రికి నెల‌స‌రి రూ.10వేల జీతం అనుకున్నా రూ.160 కోట్ల‌కు మించి ఉండ‌దు.

మొత్తంగా చూస్తే.. రూ.350 కోట్లు లేదంటే రూ.400 కోట్లు. ఇంత త‌క్కువ మొత్తంలో ఏకంగా 5.6ల‌క్ష‌ల ఉద్యోగాల్ని క‌ల్పించ‌టం.. గ్రామాల్ని ప‌రిపుష్టం చేయ‌టం చూసిన‌ప్పుడు.. జ‌గ‌న్ ప్లానింగ్ అదిరిపోయేలా ఉంద‌ని చెప్పాలి. అవినీతిని త‌గ్గించే కార్య‌క్ర‌మంలో జ‌గ‌న్ స‌క్సెస్ అయితే.. దానికి వ‌చ్చే ఇమేజ్ తో పోలిస్తే.. రూ.400 కోట్లు ఒక లెక్క‌లో ఉండ‌వ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.