Begin typing your search above and press return to search.
ఎస్సీ.. ఎస్టీ సుప్రీంతీర్పుపై జగన్ స్టాండ్ ఇది
By: Tupaki Desk | 3 April 2018 11:03 AM ISTసుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ఉత్తరభారతాన్ని రగిలిపోయేలా చేసి.. పలువురు ప్రాణాలు పోయేలా చేసింది. పెద్ద ఎత్తున గాయాలబారిన పడేలా చేసింది. ఇంతకీ సుప్రీం ఇచ్చిన ఆ తీర్పు ఏమిటన్నది ఒక్కమాటలో చూస్తే.. ఎస్సీ.. ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసులు నమోదైన నిందితులను అరెస్ట్ చేయటం తప్పనిసరి కాదన్న కీలక వ్యాఖ్యపై దేశంలోని పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
సుప్రీంతీర్పును పెద్ద ఎత్తున తప్పు పడుతున్నారు. ఇలాంటివేళ.. ఈ సున్నితమైన అంశంపై తన స్పష్టమైన వైఖరిని ప్రకటించారు ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సుప్రీం ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ రాష్ట్రపతి.. ప్రధానికి లేఖ రాశారు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎస్సీ.. ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్ట స్ఫూర్తిని నీరుగార్చేలా ఉందని తాము నమ్ముతున్నట్లుగా జగన్ పేర్కొన్నారు.
ఈ అంశంపై జగన్ ప్రస్తావించిన అంశాలు చూస్తే..
+ ‘ఎస్సీ - ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం–1989 కింద కేసులు నమోదైన నిందితులెవరినీ తక్షణమే అరెస్టు చేయరాదు. సంబంధిత నియామక అధికారి అనుమతిస్తేనే ఈ కేసులో నిందితులైన ప్రజా సేవకులు / ఉద్యోగులను అరెస్టు చేయాల్సి ఉంటుంది. పోలీసు సూపరింటెండెంటు అనుమతించిన తర్వాతే ఎస్సీ - ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం కింద నిందితులను అరెస్టు చేయాలి. ఈ విషయంలో తగిన కారణాలను రికార్డ్ చేయాలి. తదుపరి విచారణ సమయంలో మేజిస్ట్రేట్ ఈ కారణాలను తప్పనిసరిగా పరిశీలించాలి’అంటూ గత నెల 20వ తేదీన సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం మీకు విదితమే. ఎస్సీ - ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం స్ఫూర్తిని దెబ్బతీసేలా ఈ తీర్పు ఉందని వైఎస్సార్ సీపీ ప్రగాఢంగా విశ్వసిస్తోంది.
+ నిందితుని అరెస్టును అడ్డుకోవడం - బలహీనుడైన బాధితుడి కంటే బలవంతుడైన నిందితుడికే ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. తదుపరి దర్యాప్తునకు సైతం అడ్డు కలిగిస్తుంది.
+ సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ - ఎస్టీ కేసుల్లో అరెస్ట్ నుంచి నిందితులకు రక్షణ కల్పించినట్లుంది. ఇది అణగారిన వర్గాల హక్కులకు సంరక్షకుడిగా న్యాయస్థానం ఉందన్న తిరుగులేని నమ్మకాన్ని తగ్గించేదిగా ఉంది.
+ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎస్సీ - ఎస్టీలపై వేధింపులు లేకుండా ఒక్క రోజు కూడా గడవటం లేదనేది కాదనలేని సత్యం. ఈ పరిస్థితుల్లో అత్యంత ముఖ్యమైన ఈ చట్టాన్ని నీరుగార్చడం వల్ల ఎస్సీ - ఎస్టీల మనోస్థైర్యం దెబ్బ తింటుంది.
+ స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లైనా ఇప్పటికీ సమాజంలో ఎస్సీ - ఎస్టీలు అత్యంత అణచివేతకు గురవుతున్నారు. వివిధ రంగాల్లో అభివృద్ధికి నోచుకోక నిస్సహాయులుగా మిగిలిపోతున్నారు. సమానావకాశాలకు నోచుకోక - విద్యలో వెనుకబడి పౌష్టికాహార లోపంతో దుర్భర స్థితిలో అల్లాడుతున్నారు. కుల రహిత సమాజ స్థాపనే మన రాజ్యాంగ లక్ష్యం. అది నెరవేరే వరకూ ప్రభుత్వం అణగారిన వర్గాలకు సమానావకాశాలు కల్పించాలి.
+ ఈ పరిస్థితుల్లో అతి ముఖ్యమైన ఎస్సీ - ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం – 1989ని బలహీనపరచడాన్ని ఏమాత్రం అనుమతించరాదని వినయపూర్వకంగా కోరుతున్నా. అందువల్ల ఈ తీర్పుపై పునఃసమీక్ష కోసం సుప్రీంకోర్టుకు ప్రతిపాదించాలని కోరుతున్నా.
+ 40 ఏళ్లుగా ప్రజాజీవితంలో (రాజకీయాల్లో) కొనసాగుతూ అత్యంత అభివృద్ధి చెందుతున్న ఒక రాష్ట్రానికి 13 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు లాంటి వారే ఎస్సీ - ఎస్టీలను కించపరిచేలా మాట్లాడుతున్నారు. ‘ఎవరు మాత్రం ఎస్సీల్లో పుట్టాలని కోరుకుంటారు?’అని ఎస్సీ - ఎస్టీల గురించి చంద్రబాబు మాట్లాడారు. ‘ఎస్సీలకు శుచి - శుభ్రత ఉండదు. చూడటానికి అసహ్యంగా ఉంటారు. హుందాగా బతకటం తెలియదు.. ’అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మార్కెటింగ్ - గిడ్డంగుల శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి సైతం ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పాలకులు ఇలా ఫ్యూడల్ మనస్తత్వాన్ని ప్రదర్శిస్తూ దళితులను అణచివేస్తున్నారు. దళితుల పట్ల ప్రజాజీవనంలో ఉండే వారి మనస్తత్వమే ఇలా ఉంటే ఇతరుల మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఆలోచించండి.