Begin typing your search above and press return to search.

బాబు లాంటోళ్లు ఉంటే దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చేది కాదు

By:  Tupaki Desk   |   4 Feb 2019 6:35 AM GMT
బాబు లాంటోళ్లు ఉంటే దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చేది కాదు
X
ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌త్యేక హోదా మీద ఇచ్చిన హామీల‌కు.. చేసిన ప‌నికి సంబంధం లేద‌న్న విష‌యాన్ని చెప్ప‌ట‌మే కాదు.. హోదా విష‌యంలో బాబు స్టాండ్ ను తీవ్ర‌స్థాయిలో దుమ్మెత్తి పోశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. హోదా విష‌య‌మై అంద‌రూ క‌లిసి క‌ట్టుగా పోరాడాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

హోదా కోసం ఉద్య‌మిస్తున్న యువ‌త మీద బాబు ప్ర‌భుత్వం కేసులు న‌మోదు చేస్తుంద‌ని.. త‌మ ప్ర‌భుత్వం త్వ‌ర‌లో వ‌చ్చేస్తుంద‌ని.. తాము ప‌వ‌ర్లోకి వ‌చ్చినంత‌నే యువ‌కుల మీద పెట్టిన కేసుల‌న్నింటిని ఎత్తివేస్తామ‌న్నారు. ప్ర‌త్యేక హోదాను ఖూనీ చేసింది చంద్ర‌బాబు కాదా? అని ప్రశ్నిస్తున్నారు. హోదాను ఖూనీ చేసిన బాబును ఆ దేవుడు.. ఏపీ ప్ర‌జ‌లు ఏ మాత్రం క్ష‌మించ‌రని.. ఆయ‌న్ను బంగాళాఖాతంలో క‌లిపేస్తామ‌న్నారు.

ప్ర‌త్యేక హోదా అన్న‌ది ఆంధ్రోళ్ల శ్వాస‌గా అభివ‌ర్ణించిన జ‌గ‌న్‌.. హోదా కోసం మ‌నం పోరాడ‌కుంటే ప్ర‌జ‌లు మ‌ర్చిపోయేలా చంద్ర‌బాబు చేస్తార‌న్నారు. హోదాను నీరుకారిస్తే ఒప్పుకోకూడ‌ద‌న్న ఆయ‌న‌.. అంద‌రం ఏక‌మ‌వుదామ‌ని పిలుపునిచ్చారు. పార్టీల‌న్నీ ఏక‌మై హోదాను సాధిద్దామ‌న్నారు. త‌మిళ‌నాడులో జ‌రిగిన‌ జ‌ల్లిక‌ట్టు ఉద్య‌మం ఒక ఆట కోసం కాకుండా.. క‌లిసిక‌ట్టుగా చేసిన పోరాటంగా అభివ‌ర్ణించారు. అక్క‌డి ముఖ్య‌మంత్రి అన్ని పార్టీల‌ను క‌లుపుకొని ఢిల్లీకి తీసుకెళ్లిన వైనాన్ని గుర్తు చేశారు.

సుప్రీంకోర్టు నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా అంద‌రూ ఏక‌మై.. ఢిల్లీకి వెళ్లి జ‌ల్లిక‌ట్టు అంశంపై పోరాడార‌న్నారు. సాధ్యం కాద‌నుకున్న‌తెలంగాణ వ‌చ్చింద‌ని.. చంద్ర‌బాబు నేత‌లాంటోళ్లు ఉంటే దేశానికి స్వాతంత్య్రం కూడా వ‌చ్చేది కాద‌న్నారు. స్వాతంత్య్రం సంగ్రామంలో బాబు కానీ.. ముఖ్య‌మైన స్థానంలో ఉంటే దేశానికి స్వాతంత్య్రం రాకుండా చేసేవార‌న్నారు.

బాబు వ‌స్తే జాబు అన్నార‌ని.. కానీ బాబు పోతేనే జాబు అని తాను చెబుతున్నాన‌ని చెప్పారు. అంద‌రం ఏకం కావాల‌న్న జ‌గ‌న్‌.. సుజ‌నా చౌద‌రి.. చంద్ర‌బాబు లాంటి వారి మాట‌ల్ని వింటుంటే.. వారు చెప్పే అబ‌ద్ధాలు.. మోసాల్ని చూస్తుంటే.. వీళ్లు అస‌లు మ‌నుషులేనా? అన్న అనుమానం క‌లుగుతుంద‌న్నారు.

ప్ర‌త్యేక హోదా మీద మాట్లాడుతూ.. ప‌రిశ్ర‌మ‌లు పెట్ట‌టానికే రెండు.. మూడేళ్లు ప‌డుతుంద‌ని అందుకే హోదా ప‌దిహేనేళ్లు కావాల‌ని వెంక‌య్య‌నాయుడు అప్ప‌ట్లో అన్నార‌ని గుర్తు చేశారు. ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో మోడీని ప‌క్క‌న పెట్టుకొని హోదా ప‌దేళ్లు కావాల‌ని వెంక‌య్య అడ‌గ‌లేదా? మోడీని ప‌క్క‌న పెట్టుకొని మీరు చెప్పిందేమిటి? ఇప్పుడు మీరు చేస్తున్న‌దేమిటి? అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.