Begin typing your search above and press return to search.
పేదలకు సేవ చేయండి: జగన్
By: Tupaki Desk | 30 Sep 2019 10:06 AM GMTప్రతీ పేదవాడికి పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు చేరేలా చూడాలని గ్రామ వలంటీర్లకు వైఎస్ జగన్ ఉపదేశం ఇచ్చారు. సేవ చేయడం కోసమే ఈ ఉద్యోగం చేస్తున్నామనే విషయాన్ని ప్రతీ గ్రామ - వార్డు సచివాలయం ఉద్యోగి గుర్తు పెట్టుకోవాలని జగన్ సూచించారు. దేశంలో ఇలాంటి ప్రయోగం చేసిన తాము దీన్ని కలిసికట్టుగా విజయవంతం చేసేందుకు గ్రామ సచివాలయ ఉద్యోగులు సహకరిస్తారనే నమ్మకం ఉందని జగన్ చెప్పుకొచ్చారు.
విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ సహా మంత్రులు కొడాలి నాని - పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి - పేర్నినాని - బొత్స సత్యనారాయణలు గ్రామ - వార్డు సచివాలయ రాతపరీక్షల్లో అర్హత సాధించి ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలను సోమవారం అందజేశారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఇంత తక్కువ సమయంలో పారదర్శకంగా ఏకంగా ఇరవై లక్షల మందికి పైగా ఉద్యోగాలు రాయించి లక్షా నలభై వేల మందికి శాశ్వత ఉద్యోగాలు ఇవ్వడం దేశ చరిత్రలోనే ఓ రికార్డు అని అన్నారు. ప్రతీ యాభై ఇళ్లకు ఒక వలంటీర్ ఉద్యోగం ఇచ్చామన్నారు.
గ్రామ - వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రతీ పేదవాడి ముఖంలో ఆనందం తీసుకురండి అని జగన్ పిలుపునిచ్చారు. అమెరికాలో ఉండి సొంత గడ్డకు సేవ చేయాలని తపన పడే వారికి సొంత మండలంలోనే ఉద్యోగం చేసే భాగ్యం తాము కల్పించాని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. గ్రామాల్లో రేషన్ కార్డు నుంచి ధ్రువీకరణ పత్రం దాకా అన్నింటిని గ్రామ సచివాలయ ఉద్యోగులే లంచాలకు దూరంగా పారదర్శకంగా ఉండాలని.. పేదలకు సేవ చేయాలని సూచించారు. మొత్తం గ్రామాల్లో 34 పనుల్లో వీరు పాలుపంచుకోవాలని తెలిపారు. జనవరి 1 నుంచి 500 సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. గ్రామ వలంటీర్లకు ఒక స్మార్ట్ ఫోన్ కూడా ఇస్తామన్నారు. జనవరి 1 నుంచి కొత్త రేషన్ కార్డులు - పింఛన్లు వస్తాయని తెలిపారు.
తెలంగాణలో ఉద్యోగాల కోసమే ఉద్యమం జరిగిందని.. ఒక్క తెలంగాణే కాదు.. అన్ని రాష్ట్రాల్లోనూ ఉద్యోగాల కోసం విద్యార్థులు నిత్యం పోరాడుతూనే ఉన్నారని జగన్ అన్నారు. అయితే ఏపీలో మాత్రం ఉద్యమాలు లేకుండా రికార్డ్ స్థాయిలో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని జగన్ అన్నారు. అక్టోబర్ 2న ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మాట నిలుపుకున్నామన్నారు.
భారత్ లోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి సాధ్యం కాదని తాను ప్రజల మనిషి గా మారోసారి చాటుకొని నిజం చేశానని జగన్ అన్నారు. నాలుగు నెలల్లోనే ఉద్యోగాలు కల్పించానని చెప్పుకొచ్చారు.
ప్రజల ఆశీర్వాదంతో అన్ని వాగ్ధానాలను నెరవేరుస్తానని జగన్ అన్నారు. గ్రామ, మున్సిపాలిటీల్లో కొత్త వార్డులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామ - వార్డు సచివాలయ ఉద్యోగులు వారి సొంత గ్రామాల్లో కోరుకున్న చోట ఎక్కడైనా పనిచేయవచ్చని.. అక్కడే పోస్టింగ్ ఇస్తామన్నారు.