Begin typing your search above and press return to search.

జగన్ సీఎం కాకూడదంతే...సినీ ప్రముఖుల పంతం...?

By:  Tupaki Desk   |   26 Nov 2022 9:39 AM GMT
జగన్ సీఎం కాకూడదంతే...సినీ ప్రముఖుల పంతం...?
X
టాలీవుడ్ కి టాడేపల్లికి మధ్య గ్యాప్ చాలా ఉంది అని అంటారు అంతా. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్న కొన్ని నిర్ణయాలు టాలీవుడ్ కి ఏ మాత్రం రుచించలేదు అన్నది తెలిసిందే. టికెట్ల రేట్లు తగ్గించడం నుంచి మొదలైన వివాదం కాస్తా బెనిఫిట్ షోలను రద్దు చేయడం వంటి వాటితో ఇంకా పెరిగింది. దానికంటే ముందు టాలీవుడ్ సమస్యలు ఏవీ పరిష్కారం కాలేదు కానీ కొత్త సమస్యలు వైసీపీ ఏలుబడిలో సృష్టించారు అని అంటున్నారు.

ఇక టాలీవుడ్ లో టికెట్ల తగ్గింపు మళ్లీ దాని సరిచేయడం వెనక ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలుసు. ఏకంగా టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి వంటి వారు రావాల్సి వచ్చింది. అలాగే మహేష్ బాబు ప్రభాస్ వంటి హీరోలు కూడా నాడు వచ్చారు. ఇదిలా ఉంటే నాగార్జున వంటి హీరోలు జగన్ కి సన్నిహితంగా ఉంటూ వచ్చారు.

కానీ ఆ తరువాత తాడేపల్లితో టాలీవుడ్ కి వార్ స్టార్ట్ కావడంతో ఆయన కూడా సైడ్ అయ్యారని అంటున్నారు. జగన్ సీఎం అయిన కొత్తల్లో విశాఖలో సినీ రంగాన్ని అభివృద్ధి చేయాలని చూశారు. ఆనాడు ఆయన చాలా మంది సినీ ప్రముఖులతో భేటీ వేశారు. ఇది సజావుగా సాగింది అనుకునేంతలో టికెట్ల వివాదం, థియేటర్ల మీద తనిఖీల పేరిట దాడులు నిర్వహించడం వంటి పరిణామాలతో చాలా దూరం పెరిగిపోయింది.

మరో వైపు చూస్తే టాలీవుడ్ నుంచి వైసీపీకి పెద్దగా మద్దతు మొదటి నుంచి లేదు. సినీ నటుడు మోహన్ బాబు వంటి వారు ఎన్నికల ముందు సపోర్ట్ చేసినా ఆ తరువాత వారు తప్పుకున్నారు. జయసుధ, జీవితా రాజశేఖర్ వంటి వారు కూడా పక్కకు తొలగారు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పేరుతో వచ్చి వైసీపీలో పదవి సంపాదించుకున్న పృధ్వీ కూడా వైసీపీ నుంచి తప్పుకున్నారు. దీంతో వైసీపీకి సినీ గ్లామర్ తగ్గిపోయింది.

ఇంకో వైపు చూస్తే టాలీవుడ్ హీరో అయిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఉంది. తెలుగుదేశం పుట్టుక కూడా సినీ ప్రముఖుడు ఎన్టీయార్ ద్వారా జరిగింది. ఇలా చూసుకున్నపుడు టాలీవుడ్ లో అత్యధిక మద్దతు ఆ రెండు పార్టీలకే ఉంది. ఈ నేపధ్యంలో వైసీపీ మీద కత్తి కట్టిన కొందరు సినీ ప్రముఖులు ఇపుడు హైదరాబాద్ లో వీకెండ్ పార్టీల పేరిట తరచూ సమావేశం అవుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీని దించడానికి చూస్తున్నారు అని అంటున్నారు.

ఇందులో హీరోలు కూడా చాలా మంది ఉన్నారు అని ప్రచారం సాగుతోంది. తమకు ఏ మాత్రం గౌరవం గుర్తింపు వైసీపీ ఏలుబడిలో లేకుండా పోయాయని బాధపడే వారు అంతా ఒక చోట చేరి వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎలా గద్దె దింపాలి అన్నది ఆలోచన చేస్తునారు అని అంటున్నారు. వీరికి వేదికగా అల్లు స్టూడియో ఉందని అంటున్నారు. అల్లు స్టూడియో అంటే ప్రముఖ నిర్మాత అరవింద్ ది. మరి అరవింద్ ఏ రాజకీయ పార్టీలో లేకపోయినా వారి ఇంట్లో జనసేన ఉంది.

సో ఈ భేటీలు అన్నీ కూడా జనసేనకు ఉపయోగపడతాయా అన్నది చూడాలి. ఇంకో వైపు చూస్తే టీడీపీకి అనుకూల హీరోలు టెక్నీషియన్స్ ఉన్నారు. బాలయ్య టీడీపీ మెంబరే. అలాగే దైరెక్టర్స్ లో ఒక దిగ్గజమైన వారు, ఒక ప్రముఖ నిర్మాత కూడా వైసీపీ ఓటమి కోసం కృషి చేస్తున్నారు అని అంటున్నారు. ఈ వీకెండ్ పార్టీలలో వీరితో పాటుగా ఏపీలో పనిచేసి పదవీ విరమణ చేసిన మాజీ ఐఏఎస్ అధికారులు ఇతర మేధావులు కూడా ఉన్నారని అంటున్నారు. మొత్తానికి అంతా కలసి మరోసారి జగన్ సీఎం కాకూడదు అంతే అన్నట్లుగా పంతం పట్టారని టాక్. మరి ఇది ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి. అలాగే ఈ ప్రయత్నాల వెనక ఏ రాజకీయ పార్టీ ఉందో కూడా చూడాలని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.