Begin typing your search above and press return to search.

ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ పై జగన్ మరో కీలక నిర్ణయం !

By:  Tupaki Desk   |   13 April 2020 1:20 PM GMT
ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ పై జగన్ మరో కీలక నిర్ణయం !
X
ఏపీలో కరోనా మహమ్మారి పంజా విసురుతున్న సమయంలో ..కరోనా కట్టడికి ఒకవైపు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూనే మరోవైపు ,ఇతరత్రా వ్యవహారాలపై సీరియస్‌ గా ఫోకస్ చేస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. గత నెలలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ప్రభుత్వాన్ని ఇరుకున బెట్టిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రెండ్రోజుల క్రితం ప్రత్యేక జీవోల ద్వారా సాగనంపిన సీఎం జగన్ తాజాగా రాజధాని భూముల ఇన్‌ సైడర్ ట్రేడింగ్‌ పై విచారణలోను తన దూకుడు ఏమాత్రం తగ్గలేదు అని చెప్పకనే చెప్తున్నాడు.

రాజధాని భూముల్లో ఇన్‌ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ఆరోపణలపై విచారణ జరుపుతున్న సిట్‌ కు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. రాజధాని భూములు విచారణలో జగన్ ప్రభుత్వం మొదటి నుండి ఒకేరకమైన దూకుడుతో వ్యవహరిస్తోంది ..ఇప్పుడు కూడా ఆ దూకుడును ఏ మాత్రం తగ్గించలేదు. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా విచారణకు సిట్‌ ను నియమించింది ప్రభుత్వం.

తాజాగా సిట్‌ కు చీఫ్ లీగల్ అడ్వైజ ర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ అడ్వకేట్ ఐనకొల్లు వెంకటేశ్వర్లును రాజధాని భూముల ఇన్‌ సైడర్ ట్రేడిం గ్‌పై దర్యాప్తు జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి చీఫ్ లీగల్ అడ్వైజర్‌ గా నియమించింది జగన్ సర్కార్. రాజధాని భూ కుంభకోణం విచారణలో ఎటువంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది ఏపీ ప్రభుత్వం.