Begin typing your search above and press return to search.

కిష‌న్ రెడ్డికి జ‌గ‌న్ షాక్‌.. ఏం చేశారంటే!

By:  Tupaki Desk   |   19 Aug 2021 5:30 PM GMT
కిష‌న్ రెడ్డికి జ‌గ‌న్ షాక్‌.. ఏం చేశారంటే!
X
బీజేపీ కీల‌క నాయ‌కుడు, కేంద్ర మంత్రి, తెలంగాణ నేత‌.. జి. కిష‌న్‌రెడ్డికి ఏపీ ప్ర‌భుత్వం భారీ షాక్ ఇచ్చిం ది. ప్ర‌స్తుతం రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం.. బుధవారం.. ఏపీకి వ‌చ్చిన కిష‌న్ రెడ్డి తొలుత తిరుమ‌లలో త‌న ప‌ర్య‌ట‌న ప్రారంభించారు. అక్క‌డ ప్ర‌స్తుతం పార్టీ నేత‌లు త‌ల‌పెట్టిన `జ‌న ఆశీర్వాద్‌` ర్యాలీలో పాల్గొ న్నారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన స‌మావేశంలో కిష‌న్ రెడ్డి మాట్లాడుతూ.. జ‌గ‌న్ స‌ర్కారుపై విరుచుకుపడ్డా రు. క‌క్ష పూరిత రాజ‌కీయాల‌కు ఏపీ కేరాఫ్‌గా మారిందని.. ఇలాంటి ప‌రిస్థితి ఎప్పుడూ చూడ‌లేద‌ని అన్నారు. ఈ ప‌రిణామాల‌తో జ‌గ‌న్ స‌ర్కారుకు ఒకింత ఆవేద‌న క‌లిగించింది.

ప్ర‌ధానంగా.. జ‌గ‌న్ వ్య‌తిరేక మీడియాలో కిష‌న్ రెడ్డి వ్యాఖ్య‌లు జోరుగా వైర‌ల్ అయ్యాయి. దీంతో వ్యూహాత్మ‌కం గా ప్ర‌భుత్వం త‌న వైఖ‌రిని మార్చుకుంది. తిరుప‌తిలో సాగిన జ‌న ఆశీర్వాద్ ర్యాలీకి అనుమ‌తి ఇచ్చిన అధికారులు ఇక‌, విజ‌య‌వాడ‌కు వ‌చ్చే స‌రికి మాత్రం త‌మ పంథాను మార్చుకుని.. కేంద్ర మంత్రికే షాక్ ఇచ్చారు. తిరుప‌తి నుంచి నేరుగా గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యానికి చేరుకుని.. అక్క‌డ నుంచి విజ‌య‌వాడ చేరుకుని.. అక్క‌డ జ‌న ఆశీర్వాద్ స‌భ‌ను ప్రారంభించాల‌ని.. అనుకున్న కిష‌న్ రెడ్డికి పోలీసులు అడ్డు చెప్పారు.

కిషన్‌రెడ్డి ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. గురువారం ఆయన గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడకు ర్యాలీగా బయలుదేరారు. ఎనికేపాడు వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని తేల్చిచెప్పడంతో పోలీసులు, బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కేవలం రెండు కార్లను మాత్రమే విజయవాడ వైపు అనుమతించారు. దీంతో కార్లు, బైకులన్నీ అక్కడే నిలిచిపోయాయి. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్త‌వానికి గురువారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి.. అనంతరం అక్కడ నుంచి విజయవాడకు బయలుదేరారు. ఈ ప‌రిణామాల‌తో.. మున్ముందు.. బీజేపీ వ‌ర్సెస్ వైసీపీ రాజ‌కీయం వేడెక్కుతుందా? అనే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.