Begin typing your search above and press return to search.

అధికారులకి వారం గడువు ఇచ్చిన సీఎం జగన్..ఎందుకు ?

By:  Tupaki Desk   |   26 Dec 2019 1:27 PM GMT
అధికారులకి వారం గడువు ఇచ్చిన సీఎం జగన్..ఎందుకు ?
X
ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు వారం రోజుల గడువు ఇచ్చారు. అమరావతి క్యాంప్ ఆఫీసులో గురువారం కీలకమైన సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలోనే ఆయన అధికారులకు వారం రోజుల గడువు ఇచ్చారు. ఉగాది పండుగ రోజున 25 లక్షల ఇళ్ళ పట్టాలను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్ - ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ అంశంపై గురువారం తన క్యాంప్ ఆఫీసులో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి - రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్ - సీఎస్‌ నీలం సహానీ ఇతర అధికారులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో అధికారులకి సీఎం కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే జిల్లాల వారీగా లబ్ధిదారుల సంఖ్య - గుర్తించిన స్థలాలపై సమీక్ష జరిపారు. ఈ సమయంలోనే విశాఖపట్నం - తూర్పుగోదావరి - పశ్చిమగోదావరి - కృష్ణా - గుంటూరు జిల్లాల్లో ఇళ్ల పట్టాల కోసం అధికంగా భూములు సేకరించాల్సి ఉందని అధికారులు సీఎంకు వివరించారు. దీనితో అర్హులైన ప్రతి ఒక్కరికి భూములు ఇచ్చేలా - అనువైన భూమిని వారం రోజుల్లో గుర్తించాలని సీఎం సూచించారు. అలాగే , లబ్ధిదారులకు ఇళ్లస్థలాలు మార్కింగ్‌ చేసి ఇంటిపట్టాలను రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలని, పట్టాపత్రాన్ని సెక్యూరిటీ ఫీచర్స్‌ తో రూపొందించాలని చెప్పారు.

దీనికి సంబంధించి పలు రకాల నమూనా పత్రాలను అధికారులు సీఎంకు చూపించారు. అర్హత ఉండి ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ , పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇవ్వాలని అధికారులకి ఆదేశాలు జారీచేశారు. ఇప్పటివరక 22 లక్షల 46 వేల139 మంది లబ్ధిదారులను గుర్తించామని, వీరిలో 11 లక్షల 77 వేల 260 మంది గ్రామీణ ప్రాంతాల లబ్ధిదారులని, 10 లక్షల 99 వేల 160 మంది పట్ణణ ప్రాంతాల్లో లబ్ధిదారులని అధికారులు పూర్తి వివరాలని సీఎం జగన్ కు తెలిపారు. వీరందరికీ ఇళ్ళ పట్టాలిచ్చేందుకు సుమారు 23 వేల ఎకరాల భూములు అవసరమని చెప్తున్నారు.