Begin typing your search above and press return to search.
చంద్రబాబుకి ఉత్తమ చెత్త సీఎం అవార్డు ఇవ్వాలి!!
By: Tupaki Desk | 10 Oct 2018 4:49 PM GMTఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మరోమారు ఏపీ ప్రతిపక్ష నేత - వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. బాబుకి ఉత్తమ చెత్త సీఎం అవార్డు ఇవ్వాలి అని అన్నారు. చంద్రబాబుకు వ్యవసాయరంగంలో ఉత్తమ అవార్డు ఇవ్వడం పట్ల తీవ్రంగా ఖండించారు. రైతులను నిండా ముంచిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రపంచంలోనే నంబర్ వన్ ఉత్తమ చీటర్ అవార్డు ఇవ్వాలని సూచించారు. బీజేపీకి చెందిన కేంద్రమంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్నారంటే..వారి మధ్య బంధం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చునని ఆయన వ్యాఖ్యానించారు. విజయనగరం జిల్లా గజపతినగరం బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ... 108 సర్వీసులను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. 108 లు పనిచేయకపోవడంతో గర్బిణీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. 108 కోనుగోలులో కూడా చంద్రబాబు లంచాలు దండుకున్నారని విమర్శించారు. గోస్థనీ-చంపావతీ అనుసందానం చేసి గజపతినగరం రైతులకి నిర్మిస్తామని మాట ఇచ్చి సీఎం మరిచారన్నారు.
`విజయనగరం జిల్లాలో 34 మండలాలు ఉంటే.. 32 మండలాలలో లోటు వర్షపాతం ఉంది. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అయినా హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యవసాయ పురస్కారం చంద్రబాబుకి ఇవ్వనున్నారు` అని జగన్ ఎద్దేవా చేశారు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తికి వ్యవసాయ సంబందిత అవార్డులా? అని విమర్శించారు. చంద్రబాబు హయంలో పంట దిగుబడులు తగ్గిపోయాయ్.. రాష్ట్రం అంతా వ్యాదులు, కరువుతో ప్రజలు అల్లాడుతున్నారు. అయినా కూడా సీఎం పట్టించుకోవడం లేదన్నారు. చంద్రబాబుకి కలియుగ కుంబకర్ణ, ఉత్తమ కరువురత్న - ఉత్తమ చెత్త ముఖ్యమంత్రి అవార్డులు ఇవ్వాలి అని జగన్ అన్నారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్తను మార్చడానికి మీ అందరి ఆశీర్వాదం కావాలన్నారు. నవరత్నాల ద్వారా ప్రజల ముఖాన చిరునవ్వులు చూడాలనుకుంటున్నా అని జగన్ అన్నారు.
చంద్రబాబు పురస్కారం అందుకోవడంపై జగన్ ఎద్దేవాచేశారు.``బాబుకు అవార్డు ఇచ్చేది ఎవరో తెలుసా..బీజేపీకి చెందిన రాజ్ నాథ్ సింగ్. ఆయన చేతుల మీదుగా అందుకోబోతున్నాడట. ఇదే రాజ్ నాథ్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా చంద్రబాబు ఎప్పటికీ మా మిత్రుడే అన్నారు. ఇప్పుడు ఆయన చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకోవడం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాగి వచ్చి రోజు భార్యను కొట్టే భర్తకు ఉత్తమ భర్త అవార్డు ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది చంద్రబాబు వ్యవసాయ రంగంలో అవార్డు ఇచ్చినట్లుగా దారుణంగా ఉంది`` అంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రైతులకు జగన్ పలు హామీలు ఇచ్చారు. ``రైతులను ఆదుకునేందుకు వైఎస్ ఆర్ రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెడతాం. రైతులకు పెట్టుబడుల కోసం ఏటా రూ.12500 ఇచ్చి తోడుగా ఉంటాం. వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం. పగటి పూట ఉచితంగా 9 గంటల కరెంటు ఇస్తాం. ఉచితంగా బోర్లు వేయిస్తాం - ప్రతి మండలంలో కోల్డు స్టోరేజీ గోడౌన్లు ఏర్పాటు చేస్తాం. పాడీ రైతులను ఆదుకుంటాం. ప్రతి లీటర్ కు రూ.4 ప్రోత్సాహకంగా అందజేస్తాం. కరువు వచ్చినా - అతివృష్టి - అనావృష్టి నుంచి తోడుగా ఉండేందుకు ప్రకృతి వైఫరీత్యాల కింద రూ.4 వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తాం. మద్దతు ధర కల్పించేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. ఇందులో కూడా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే సలహాలు - సూచనలు ఇవ్వవచ్చు`` అని ఆయన పేర్కొన్నారు.