Begin typing your search above and press return to search.
పెన్షన్ నామ సంవత్సరం అంటున్న జగన్
By: Tupaki Desk | 31 Dec 2022 2:13 PM GMTఏపీలో కొత్త ఏడాదిలో అడుగుపెడుతూనే సామాజిక పెన్షనర్లకు జగన్ స్వీట్ న్యూస్ అందించారు. అంతే కాదు ఆ స్వీట్ ని పట్టుకుని వాలంటీర్లు ఇళ్లకు వెళ్ళి మరీ పెన్షనర్లకు పెరిగిన పెంచన్ మొత్తాన్ని అందిస్తారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు జగన్ పెన్షన్ని దశలవారీగా మూడు వేల రూపాయల దాకా పెంచుతామని చెప్పారు. ఆ మెరకు ఇపుడు నాలుగవ ఏడాదిలో ప్రభుత్వం అడుగు పెట్టిన వేళ నెల వారీ పెన్షన్ని 2,750 రూపాయలకు పెంచారు.
కొత్త ఆంగ్ల సంవత్సరం 2023లో తొలిరోజు ఆదివారం అయినా ప్రతీ ఇంటికీ పెన్షన్ని కచ్చితంగా అందచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇక కొత్తగా 2023 జనవరి నెల నుంచి 2.31 లక్షల మందికి అందనుంది. అలాగే పాత కొత్త పెన్షన్లు అన్నీ కలసి ఏకంగా రాష్ట్రంలో 64 లక్షల మందికి పైగా అందచేస్తున్నారు. ఆ విధంగా చూస్తే దేశంలో ఇంత పెద్ద సంఖ్యలో సామాజిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రంగా ఏపీ రికార్డుని నెలకొల్పనుంది.
మరోవైపు చూసే ఈ సామాజిక పెన్షన్లకు అయ్యే ఖర్చు అక్షరాలా నెలకు 1700 కోట్ల రూపాయలు అవుతోంది అని వైసీపీ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. రీ వెరిఫికేషన్ లో భాగంగా అర్హులకు మాత్రమే పెన్షన్ అందాలని ప్రభుత్వం ప్రతీ ఆరు నెలలకు ఒకసారి తనిఖీలు చేస్తుంది తప్ప కోతలు పెట్టడానికి కాదని వైసీపీ నేతలు అంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఇదే విషయాన్ని నర్శీపట్నం సభలో చెప్పారు.
విపక్షాలు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. మరో రెండున్నర లక్షల మందికి అదనంగా పెన్షన్ ఇస్తున్నామని ఆయన చెప్పారు. ఇదే విషయాన్ని జనాల్లో ప్రచారం చేయడం ద్వారా విపక్షాలకు గట్టి కౌంటర్ ఇవ్వడానికి వైసీపీ సర్కార్ పెద్దలు సిద్ధపడుతున్నారు
పెన్షన్ వారోత్సవాలు పేరిట జనవరి 3 నుంచి 10 వరకూ ఏపీ అంతటా నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది. ఇందుకోసం రాజమహేంద్రవరానికి ముఖ్యమంత్రి ఈ నెల 3న చేరుకుని పెన్షన్ వారోత్సవాలను ప్రారంభిస్తారు. తాము ఎన్నికల్లో చెప్పిన మేరకు పెన్షన్ దశలవారీగా పెంచుకుంటూ పోతున్నామని 2024 జనవరి నాటికి మూడు వేల పెన్షన్ ఇచ్చి మరీ జగన్ ఎన్నికలకు వెళ్తారని వైసీపీ నేతలు అంటున్నారు.
మొత్తనైకి 64 లక్షల మంది అంటే తక్కువ నంబర్ కాదు. ఇంతటి నంబర్ ఉండబట్టే సంక్షేమ పధకాలు ఓట్లుగా మారుతాయని వైసీపీ ఆశలుపెట్టుకుంది. ఇక ఆదివారమా పండుగా అన్నది చూడకుండా ఠంచనుగా ఒకటవ తేదీ తెల్లవారు జాము నుంచే పెన్షన్ లబ్దిదారుల ఈళ్ళకు వెళ్లి అందించడం ద్వారా కొత్త ఒరవడిని తాము సృష్టించామని చెబుతోంది.
ఇవన్నీ రానున్న రోజులలో తమకు కలసి వచ్చే అంశాలు అని అంటోంది. ఏది ఎలా ఉన్నా సామాజిక పెన్షన్ల విషయంలో జగన్ సర్కార్ కొత్త రికార్డు నెలకొల్పింది అనే అంటున్నారు. దాన్ని ఎన్నికల అజెండాగా చేసుకుని లబ్ది పొందడానికి పెన్షన్ వారోత్సవాలు నిర్వహిస్తూ విపక్షాన్ని కౌంటర్ చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.