Begin typing your search above and press return to search.

'సాక్షి' ఉద్యోగులకు గుడ్ న్యూస్!

By:  Tupaki Desk   |   11 Jun 2019 1:41 PM GMT
సాక్షి ఉద్యోగులకు గుడ్ న్యూస్!
X
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయిన నేపథ్యంలో 'సాక్షి' పై ప్రభుత్వాల నుంచి గట్టిగానే కక్ష సాధింపు చర్యలు చోటు చేసుకున్నాయి. ఆ మీడియా వర్గం అనే ఇబ్బందులను ఎదుర్కొంది. అయితే 'సాక్షి' యాజమాన్యంగా జగన్ మోహన్ రెడ్డి కుటుంబం దాన్ని నడపడంలో ఎక్కడా వెనుకంజ వేయలేదు. అయితే ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో మాత్రం పెద్దగా పెంపుదల చోటు చేసుకోలేదు.

ఐదారేళ్ల నుంచి స్వల్పమైన ఇంక్రిమెంట్లు మాత్రమే ఆ సంస్థలో చోటు చేసుకున్నాయి. సాక్షిలో మంచి శాలరీకి జాయిన్ అయిన వారికి ఈ ఐదారేళ్లలో కూడా ఇబ్బందులు ఏమీ లేవు. అయితే తక్కువ శాలరీలకు ఆ సంస్థలో చేరిన వారికి మాత్రం పెద్దగా జీతంలో గ్రోత్ లేకుండా రోజులు గడిచాయి. రోజులు, నెలలే కాదు సంవత్సరాలు కూడా వారికి అలాగే గడుస్తూ ఉన్నాయి.

అలాంటి క్రమంలో ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో 'సాక్షి' ఉద్యోగులు మంచి ఎక్సెపెక్టేషన్స్ తో ఉన్నారు. తమ జీతాలు అమాంతం పెరుగుతున్నాయని వారు ఆశించారు. అయితే అలాంటి వారికి మేనేజ్ మెంట్ గట్టి ఝలక్ ఇచ్చిందని కూడా వార్తలు వచ్చాయి.

కేవలం ఆరు పాయింట్ ఐదు శాతం గ్రోత్ రేట్ తో జీతాలు పెంచాలని మేనేజ్ మెంట్ ఫిక్సయ్యిందని, దీంతో ఐదారేళ్లుగా తక్కువ జీతాలకే పని చేస్తున్న వారు తీవ్ర నిరాశ చెందుతూ ఉన్నారని వార్తలు వచ్చాయి.

ఈ మేరకు సోషల్ మీడియాలో రకరకాల వార్తలు సర్క్యులేట్ అవుతూ వస్తున్నాయి. తాము ఎన్నో ఆశలు పెట్టుకున్నట్టుగా, అయితే ఆ ఆశలు నెరవేరకపోవడంతో సాక్షి ఉద్యోగుల అంశం చర్చనీయాంశంగా నిలిచింది. దీంతో ఈ వ్యవహారం మేనేజ్ మెంట్ దృష్టికి కూడా వెళ్లినట్టుగా సమాచారం.

ఇలాంటి తరుణంలో సాక్షి మేనేజ్ మెంట్ లోని ప్రముఖులు కొందరు తాజాగా ఏపీసీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారితో జగన్ మాట్లాడుతూ… 'వాళ్లూ కష్టపడ్డారు.. కొంచెం చూసుకోండి..' వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇది సాక్షి ఉద్యోగులకు ఆనందకరమైన అంశం అని పరిశీలకులు అంటున్నారు.