Begin typing your search above and press return to search.

ప్రత్తిపాటికి జ‌గ‌న్ లైఫ్ ఇచ్చేశారు!

By:  Tupaki Desk   |   29 March 2017 8:29 AM GMT
ప్రత్తిపాటికి జ‌గ‌న్ లైఫ్ ఇచ్చేశారు!
X
ప్ర‌త్తిపాటి పుల్లారావు... మొన్నటి ఎన్నిక‌ల దాకా ఎవ‌రికీ తెలియ‌ని పేరే. చాలా కాలం నుంచి టీడీపీలో ఉన్నా... ప్ర‌త్తిపాటికి అంత‌గా ప్రాధాన్య‌మేమీ ద‌క్క‌లేదనే చెప్పాలి. 2014 ఎన్నిక‌ల్లో గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి అతి క‌ష్టం మీద టీడీపీ టికెట్ సంపాదించిన ప్ర‌త్తిపాటి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత ప‌లు స‌మీక‌ర‌ణాలను బేరీజు వేసుకున్న టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు... ప్ర‌త్తిపాటికి త‌న కేబినెట్‌లో చోటిచ్చారు. ఇక శాఖ‌ల కేటాయింపులో భాగంగా ప్ర‌త్తిపాటికి కీల‌క‌మైన వ్య‌వ‌సాయ శాఖ దక్కింది. అంతేకాకుండా మార్కెటింగ్ శాఖ‌ను కూడా ప్ర‌త్తిపాటే త‌న భుజాల‌కెత్తుకున్నారు. ఈ రెండు కీల‌క శాఖ‌ల బాధ్య‌త‌లు కేటాయించిన చంద్రబాబు... ప్ర‌త్తిపాటికి అత్య‌ధిక ప్రాధాన్య‌మే ఇచ్చిన‌ట్టుగా పార్టీ వ‌ర్గాల అంచ‌నా. త‌న‌పై బాబు పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని మాత్రం ప్ర‌త్తిపాటి వ‌మ్ము చేశార‌నే చెప్పాలి. గుంటూరు జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్‌ గా ఉన్న ముస్లిం మ‌హిళ జానీమూన్‌తో ప్ర‌త్తిపాటి వివాదం రోడ్డెక్కింది. బాబు అండ్ కో క‌లుగ‌జేసుకుంటే గానీ... ఆ వివాదం ఓ కొలిక్కి రాలేద‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. జానీమూన్‌తో ఎంత‌మేర స‌ఖ్య‌త‌గా న‌డుచుకుంటున్నా... ప్ర‌త్తిపాటిలో మాత్రం ఆమె ప‌ట్ల వ్య‌తిరేక‌తే ఉంద‌న్న‌ది గుంటూరు జిల్లా రాజ‌కీయ నేత‌ల మాట‌.

ఈ మాట‌ను అటుంచితే... సాగు శాఖ‌నే కాకుండా మార్కెటింగ్ శాఖ‌ను కూడా స‌క్ర‌మంగా నిర్వ‌హించ‌డంలో ప్ర‌త్తిపాటి విఫ‌ల‌మ‌య్యార‌న్న‌ది బాబు అంచ‌నాగా వినిపిస్తోంది. వ్య‌వ‌సాయ శాఖ‌లో నెల‌కొన్న ప‌లు వివాదాల‌కు ప్ర‌త్తిపాటి అండ్ కోనే కార‌ణ‌మని బాబు న‌మ్మ‌క‌మ‌ట‌. రాష్ట్ర‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన న‌కిలీ ఎరువులు, విత్త‌నాలు ప్ర‌త్తిపాటి అండ‌తోనే రంగ‌ప్ర‌వేశం చేశాయ‌ని కూడా ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. దీనిపై విచార‌ణ‌కు దిగిన అధికార యంత్రాంగం పెద్ద సంఖ్య‌లో ఎరువులు, విత్త‌నాల కంపెనీల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్నారు. ఈ క్ర‌మంలో సాగు శాఖ‌ను బాగు చేయాలంటే... ప్ర‌త్తిపాటిని త‌ప్పించాల్సిందేన‌ని బాబు దాదాపుగా నిర్ణ‌యించుకున్నార‌ట‌. నేడో, రేపో త‌న త‌న‌యుడు నారా లోకేశ్ ఎంట్రీ ఇచ్చే సంద‌ర్భంగా ప్ర‌త్తిపాటికి ఊస్టింగ్ త‌ప్ప‌ద‌న్న వాద‌న కూడా బ‌లంగానే వినిపించింది. అంటే... ప్ర‌త్తిపాటి మెడ‌పై బాబు క‌త్తి వేలాడుతూనే ఉంద‌న్న‌మాట‌. అయితే వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పుణ్య‌మా అని ప్ర‌త్తిపాటి బాబు క‌త్తిని త‌న కుత్తుక మీద నుంచి ఈజీగానే తీసిపారేసుకున్నార‌ట‌.

ఆ సంగ‌తేంటో చూద్దామా?... అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో భాగంగా అగ్రిగోల్డ్ బాధితుల త‌ర‌ఫున వైఎస్ జ‌గ‌న్... బాబు స‌ర్కారుపై పోరుబాట ప్రారంభించారు. అగ్రిగోల్డ్ యాజ‌మాన్యం వ‌ద్ద కారు చౌక‌గా భూములు కొట్టేసిన ప్ర‌త్తిపాటి... నిందితుల‌ను కాపాడేందుకు తెర వెనుక మంత్రాంగం నెర‌పుతున్నార‌ని జ‌గ‌న్‌ ధ్వ‌జ‌మెత్తారు. ఈ అంశంపై మొన్న అసెంబ్లీలో పెద్ద ర‌భ‌సే జ‌రిగింది. అధికార‌, విప‌క్షాల మ‌ధ్య స‌వాళ్లు, ప్ర‌తి స‌వాళ్ల‌కు కూడా ఈ వివాదం కార‌ణ‌మైంది. ఈ స‌వాళ్ల‌లో జ‌గ‌న్‌ పై కాస్తంత పైచేయి సాధిద్దామ‌న్న క్ర‌మంలో బాబు స‌ర్కారు... ప్ర‌త్తిపాటికి క్లీన్ చిట్ ఇచ్చేసింది. ప్ర‌త్తిపాటిని నిజాయ‌తీ క‌లిగిన నేత‌గా, అగ్రిగోల్డ్ వ్య‌వ‌హారంతో ఆయ‌న‌కేమీ సంబంధం లేద‌ని కూడా బాబు స‌ర్కారు వాదించింది. ప‌నిలో ప‌నిగా నిబ‌ద్ధ‌త‌తో ప‌నిచేస్తున్న ప్ర‌త్తిపాటిపై ఆరోప‌ణ‌లు స‌వ్యం కాద‌ని కూడా ఆయ‌న‌ను ఆకాశానికెత్తేసింది. అయితే ఆ త‌ర్వాత బాబు అండ్ కో చేసిన వాద‌న అంతా గాలికి ఎగిరిపోయింది.

జ‌గ‌న్ సంధించిన ప్ర‌శ్న‌ల‌తో బాబు స‌ర్కారు ఉక్కిరిబిక్కిరి అయితే... మెడ‌పై వేటు క‌త్తి వేలాడుతున్న ప్ర‌త్తిపాటి మాత్రం సేఫ్ అయిపోయారు. ఎలాగంటే... తాము నీతిమంతుడ‌ని, నిబ‌ద్ధ‌త‌తో ప‌నిచేస్తున్నార‌ని స‌ర్టిఫికెట్ ఇచ్చిన ప్ర‌త్తిపాటిని కేబినెట్ నుంచి త‌ప్పించ‌డం బాబుకు అంత ఈజీ కాద‌న్న వాద‌న వినిపిస్తోంది. తొలుత జ‌గ‌న్ ఆరోప‌ణ‌ల‌తో మ‌రింత ఊబిలో కూరుకుపోయాన‌ని భ‌య‌ప‌డ్డ ప్ర‌త్తిపాటి... ఆ త‌ర్వాత బాబు త‌న‌ను వెన‌కేసుకుని వ‌చ్చి... అసాధార‌ణ రీతిలో బ్యాటింగ్ చేసి త‌న‌ను బ‌య‌ట‌కు ప‌డేయ‌డంతో ఇప్పుడు సంతోషంగా ఉన్నార‌ట‌. ఆ త‌ర్వాత తీరిగ్గా ఇంటికెళ్లిన ప్ర‌త్తిపాటి జ‌రిగిన ప‌రిణామాల‌న్నింటినీ ఓ సారి రివైండ్ చేసుకుని మ‌రీ... సుఖంగా నిద్ర‌పోయార‌ట‌. అప్ప‌టిదాకా ఎప్పుడు వేటు ప‌డుతుందోన‌న్న భ‌యంతో నిద్ర‌లేని రాత్రులు గ‌డిపిన ప్ర‌త్తిపాటి జ‌గ‌న్ పుణ్య‌మా అని సేఫ్ సైడ్‌ కు చేరుకుని సుఖంగా నిద్ర పోతున్నార‌ట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/